Minister Komatireddy : కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

మీరు తెలంగాణలో ఎలా పుట్టారో అర్థం కావడం లేదు...

Minister Komatireddy : సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజలింగముర్తి హత్యపై సీబీసీఐడీతో విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసుల విచారణ జరుగుతోందని.. దోషులను 24 గంటల్లోనే పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించారన్నారు. దీని వెనక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఉన్నారని ఆరోపించారు.

Minister Komatireddy Shocking Comments

‘‘మీరు తెలంగాణలో ఎలా పుట్టారో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు. బీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీయాలను మానుకోండి. దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి దిగజారారు. సామాజిక కార్యకర్త రాజలింగముర్తి హత్యను ఖండిస్తున్నాను’’ అని అన్నారు. మేడిగడ్డ అక్రమాలపై రాజలింగమూర్తి కోర్టులో పోరాడుతున్నాడని తెలిపారు. పదిమంది చిల్లరగాళ్లను రోడ్లపైకి వదిలారంటూ మండిపడ్డారు.

నీళ్లు పోసుకుని పెట్రోల్ అని చెప్పి అమాయకులు చనిపోవడానికి హరీష్ కారణం అయ్యారని దుయ్యబట్టారు. దోపిడి బయట పడుతుందని హత్యలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అడ్వకేట్ వామన రావును హత్య చేసిన వాళ్ళకే కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. హరీష్ రావు మానవత్వం ఉన్న మనిషేనా అని ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్యను డైవర్ట్ చేసేందుకు హరీష్ రావు కృష్ణా నీళ్ల గురించి మాట్లాతున్నారన్నారు. శ్రీకాంత చారిని హరీష్ రావు చంపారన్నారు. ‘‘స్కాముల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా? 15 నెలల నుండి కేసీఆర్ ఈ ఎవరికైనా కనిపించాడా? కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని కేసీఆర్‌కు ఎలా తెలుసు? ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా భట్టి ఒంటరి పోరాటం చేశారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Also Read : TG Govt : ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకుంది

Leave A Reply

Your Email Id will not be published!