Minister Komatireddy : తొక్కిసలాటకు గురైన శ్రీతేజ్ కుటుంబానికి విరాళం ప్రకటించిన సర్కార్
కాగా,సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు...
Minister Komatireddy : సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా తన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద రూ.25 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) తెలియజేశారు. మరికాసేపట్లో ఆస్పత్రికి వెళ్లి బాలుడి తండ్రికి చెక్కు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి మంత్రి తెలుకోనున్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
Minister Komatireddy Comment
కాగా,సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ముఖ్యమంత్రి మండిపడ్డారు. నటుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు వెళ్లినందుకే సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్దఎత్తున వెళ్లి పరామర్శించారని సీఎం ఆగ్రహించారు.కానీ తొక్కిసలాటలో గాయపడి మృతిచెందిన రేవతి కుటుంబాన్ని ఇంతవరకూ ఏ నేతా పరామర్శించలేదని సీఎం మండిపడ్డారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నాడని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లుఅర్జున్‌ను అరెస్టు చేస్తే విమర్శలు చేసిన వారంతా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎందుకు వెళ్లలేదని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సీఎం మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్‌షోలు ఉండవని స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం సినిమా వాళ్ల ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోవాలని, అంతేకాని మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకోమని మండిపడ్డారు. అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంతో కొన్ని రాజకీయ పార్టీల నేతలు తనపై అనేక ఆరోపణలు చేశారని సీఎం మండిపడ్డారు. వారంతా పైశాచికత్వం ప్రదర్శించారని ఆగ్రహించారు.
Also Read : Deputy CM Pawan : డిప్యూటీ సీఎంకు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికిన గిరిజనులు