Minister Konda Surekha : మరోసారి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు...
Konda Surekha : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మరోసారి ఫైర్ అయ్యారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్ భాష దారుణంగా ఉంది. కేటీఆర్ కంటే.. కేసీఆర్ బెటర్‌గా మాట్లాడుతారు. కేటీఆర్(KTR) భాష అసహ్యంగా ఉంది’’ అంటూ విమర్శలు గుప్పించారు. విద్యార్థులు పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమంలోకేసీఆర్ కుటుంబంలో ఎవరికి ఒక గీత కూడా పడలేదన్నారు.విద్యార్థులను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. కేటీఆర్(KTR)కు కామన్ సెన్స్ లేదన్నారు.
Minister Konda Surekha Comments
రేవంత్ పై కేటీఆర్ పిచ్చి కూతలు కూస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందని తెలిశాక కేటీఆర్, కవిత తట్టాబుట్టా సర్దుకొని ఉద్యమంలోకి వచ్చారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సక్సెస్ వెనక ఎంత శ్రమ ఉందో తెలుసుకోవాలన్నారు. ప్రతి దానికి రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులాలలపై సూక్ష్మంగా ఆలోచిస్తూ వారి ఎదుగుదల కోసం రేవంత్ పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ఫాం హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. కేటీఆర్ మీడియా ముందు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోయారని బీఆర్ఎస్ నాయకులు భ్రమ పడుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని.. అందుకే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవుపలికారు. గతంలో పెట్రోల్ క్యాన్ తెచ్చుకొని అగ్గిపెట్టె మర్చిపోయారని.. ఇప్పుడు పెట్రోల్ క్యాన్ తెచ్చుకుంటే అగ్గిపెట్టెలు బీఆర్ఎస్ కార్యకర్తలే తెచ్చుకుంటారంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గంధపు చెక్కల బిజినెస్ మడత పెట్టుకోవాలన్నారు. సహచర మంత్రిని తిట్టినందుకే రెస్పాండ్ కావాల్సి వస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేపై మాట్లాడాలంటే తన స్థాయి తగ్గుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజలపై ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలుసన్నారు. ఉద్యమంలో బీఆర్ఎస్ నేతలు ఉత్తుత్తి రాజీనామాలు చేశారని.. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. పోటీ చేసిన అభ్యర్థిని కలెక్టర్‌కు పరిచయం చేస్తే తప్పా అని ప్రశ్నించారు. ‘‘హుజూరాబాద్ పిచ్చోడు అసెంబ్లీలో అరుస్తాడు. అసెంబ్లీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే చప్పట్లు కొట్టి డ్యాన్సులు చేస్తాడు. కౌశిక్ రెడ్డి చిన్నపిల్లల కంటే దారుణంగా మాట్లాడుతున్నాడు’’ అంటూ దుయ్యబట్టారు.
రేవంత్రెడ్డిని అరెస్టు చేసినట్టు తాము అరెస్టు చేయాలనుకుంటే బీఆర్ఎస్ నేతలంతా జైల్లో ఉండేవాళ్ళన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నేతల హస్తం లేకపోతే ఆఫీసర్లను దేశం ఎందుకు దాటించారని ప్రశ్నించారు. చేసేది న్యాయమే అయితే సోషల్ మీడియాను వేరే దేశం నుంచి నడపాల్సిన అవసరం ఏంటని నిలదీవారు. అలాగే ‘‘యూ ట్యూబ్‌లో జరిగిన దానిపై మేం కొంత దూకుడుగా ఉండాల్సింది. మా వైఫల్యం కొంత ఉంది’’ అని తెలిపారు. తెలంగాణ తల్లిని దొరసాని లాగా చేశాని.. తెలంగాణ తల్లిని కవిత లాగా తయారు చేశారన్నారు. బంగారు ఆభరణాలు, వడ్డాణాలు పెట్టి తెలంగాణ తల్లిని తయారు చేశారని అన్నారు. సబ్బండ వర్గాల ప్రతినిధిగా తెలంగాణ తల్లిని తయారు చేస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
Also Read : MLA Harish Rao : బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అరెస్ట్..మరో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత