Minister Konda Surekha : ఫోన్ ట్యాపింగ్ పై సంచలన విషయాలు వెల్లడించిన మంత్రి
వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని అన్నారు...
Konda Surekha : కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మాట్లాడుతూ.. దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.
Minister Konda Surekha Slams
వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని అన్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైందని గుర్తుచేశారు. ఈసభ కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లగచర్ల ఘటన కలెక్టర్‌పై దాడి మాజీ మంత్రి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారని విమర్శలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అధికారులు విదేశాల్లో దాచారని ఆరోపించారు. బీఆర్ఎస్ది తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టిందని.. సైక్రియాటిస్ట్‌కు చూపించుకోవాలని సెటైర్లు గుప్పించారు. కేటీఆర్ విషయంలో నిజాలు తేల్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : Minister Seethakka : దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే