Minister Kondapalli Srinivas: కన్నుల పండుగగా రామతీర్థంలో సీతారామ కళ్యాణం

కన్నుల పండుగగా రామతీర్థంలో సీతారామ కళ్యాణం

Kondapalli Srinivas : శ్రీరామ నవమి పర్వదినం పురష్కరించుకుని ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్ధంలోని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయాలు మరియు ఆచారాల ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు సాయి రామాచార్యులు… ఉదయం 10 గంటల నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ క్రతువును ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ ముహూర్తంలో వేద పండితుల సమక్షంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఈ సీతారాముల కళ్యాణానికి సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరశింహా స్వామి దేవస్థానం తరపున జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, దేవాదయ ధర్మాదాయ శాఖ మరియు జిల్లా అధికారులు అతనికి పూర్ణకుంభంతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకులు సాయి రామచార్యులు, కిరణకుమార్ ఆధ్వర్యంలో వివాహ ఉత్సవాన్ని హయగ్రీవాచార్యులు తదితర వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.#

Minister Kondapalli Srinivas..

మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. రామతీర్ధం శ్రీ కోదండరామ స్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని… తమ ఆచార, సాంప్రదాయాల ప్రకారం సీతారాముల కళ్యాణం కోసం మధుపర్కాలు సమర్పించారు. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వామి వారిని దర్శించుకుని… కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించారు. ఈ దివ్య వివాహ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కె. కిరణ్ కుమార్ సీతారామ కళ్యాణం మరియు శ్రీరామ నవమి వేడుకల ప్రాముఖ్యతపై ఉపన్యాసం ఇచ్చారు.

Also Read : Vizianagaram Police: యువతిపై దాడి కేసును ఛేదించిన విజయనగరం పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!