KTR Minister : ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ముందా

బీజేపీకి మంత్రి కేటీఆర్ స‌వాల్

KTR Minister : తెలంగాణ ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ బీఆర్ఎస్ చీఫ్‌, సీఎం కేసీఆర్ అలాంటి ఆలోచ‌న ఏమీ లేద‌ని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు.

కానీ తాజాగా సీఎం త‌న‌యుడు కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ త‌రుణంలో మంత్రి భార‌తీయ జ‌న‌తా పార్టీని మ‌రోసారి టార్గెట్ చేశారు. ఏకంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కు స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ముందా అంటూ నిల‌దీశారు.

తాము రెడీగా ఉన్నామ‌ని బీజేపీతో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు కేటీఆర్(KTR Minister). ఈ సంద‌ర్భంగా ఒకేసారి ముంద‌స్తుకు వెళ‌దామంటూ ..ద‌మ్ముంటే రావాలంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర మంత్రి. దీంతో బీఆర్ఎస్ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ , కాబోయే సీఎం అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ స‌మ‌యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆపై ఆయ‌న చేసిన కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌లో క‌ల‌క‌లం సృష్టించేలా చేశాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీలు తాము ముంద‌స్తుకు రెడీ అని డిక్లేర్ చేశాయి. అలాంటి ఆలోచ‌న లేక పోతే కేటీఆర్ ఎలా ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నాయి విపక్షాలు. ఏది ఏమైనా మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు కేటీఆర్.

Also Read : ఆర్టీసీ బ‌స్సుల్లో వింటూనే ఉండండి

Leave A Reply

Your Email Id will not be published!