KTR Modi : మోదీ ఇచ్చిన హామీల మాటేంటి

KTR Modi : తెలంగాణ‌లో శ‌నివారం ప్ర‌ధాన మంత్రి మోదీ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌న రాష్ట్రం ప‌ట్ల కావాల‌ని వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆరోపించారు. బ‌య్యారంలో స‌మీకృత ఉక్కు క‌ర్మాగారం కోసం వేచి చూస్తున్నార‌ని కానీ దానిని ప‌క్క‌న పెట్టారంటూ పేర్కొన్నారు. చిర‌కాల స్వ‌ప్నం పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో హామీ ఇచ్చార‌ని దాని గురించి ఊసెత్త‌డం లేదంటూ ఆరోపించారు కేటీఆర్.

9 సంవ‌త్స‌రాల త‌ర్వాత మోదీ వ‌రంగ‌ల్ లో కాలు మోపడం దారుణ‌మన్నారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చి మోసం చేశారంటూ ప్ర‌ధాన మంత్రిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ ప‌ట్ల కావాల‌ని వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇంకా తిర‌స్క‌ర‌ణ కొన‌సాగుతూ వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీని , మోదీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు మంత్రి కేటీఆర్(KTR).

శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికే మోదీ ప‌ర్య‌ట‌న‌ను బహిష్క‌రించాల‌ని పిలుపునిచ్చారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి కేవ‌లం కులం, మ‌తం, విద్వేషాల పేరుతో ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెడుతున్న కాషాయ పార్టీకి కోలుకోలేని షాక్ ఇవ్వాల‌ని కోరారు కేటీఆర్.

Also Read : Varahi Yatra Pawan : 9 నుంచి రెండో దశ వారాహి యాత్ర‌

 

Leave A Reply

Your Email Id will not be published!