Minister KTR : మాకే అధికారం మాదే రాజ్యం

చెన్నూరు రోడ్ షోలో కేటీఆర్

Minister KTR : చెన్నూరు – ఆరు నూరైనా స‌రే తామే తిరిగి అధికారం లోకి రావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రోడ్ షోలో పాల్గొన్నారు. భారీ ఎత్తున జ‌నం ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయేది అధికారం త‌మ‌దేన‌ని, వ‌చ్చేది మా రాజ్య‌మేన‌ని పేర్కొన్నారు.

Minister KTR Comment

కాంగ్రెస్ బ‌లుపును చూసి వాపు అనుకుంటోంద‌న్నారు. ఎన్ని మాయ మాట‌లు చెప్పినా , ఎంత‌గా దుష్ప్ర‌చారం చేసినా ప్ర‌జ‌లు త‌మ‌కే ఓటు వేస్తార‌ని , భారీ మెజారిటీతో గెలుస్తామ‌న్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 100 సీట్లు ప‌క్కాగా వ‌స్తాయ‌ని అన్నారు.

ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌రికీ కూడా డిపాజిట్లు రావన్నారు మంత్రి కేటీఆర్(Minister KTR). దేశంలో ఎక్క‌డా లేని రీతిలో తెలంగాణ‌లో సంక్షేమ ప‌థకాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇవాళ తెలంగాణ ఆచ‌రిస్తే దేశం అనుస‌రిస్తోంద‌ని అన్నారు కేటీఆర్.

విద్యా, ఆరోగ్య ప‌రంగా ఆధునిక టెక్నాల‌జీతో వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌జ‌లకు ఇప్ప‌టి దాకా వ‌చ్చిన హామీల‌ను అన్నింటిని నెర‌వేర్చ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇచ్చిన మాట ప్ర‌కారం డిసెంబ‌ర్ 4న జాబ్ క్యాలెండ‌ర్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. ద‌శ‌ల వారీగా జాబ్స్ ను భ‌ర్తీ చేస్తామ‌ని పేర్కొన్నారు కేటీఆర్.

Also Read : Priyanka Gandhi : కేసీఆర్ ను దించితేనే కొలువులు వ‌స్తాయి

Leave A Reply

Your Email Id will not be published!