Minister KTR : గులాబీకి 80 సీట్లు ప‌క్కా – కేటీఆర్

మ‌రోసారి హ్యాట్రిక్ దిశ‌గా బీఆర్ఎస్

Minister KTR : కాంగ్రెస్ బ‌లుపు చూసి వాపు అనుకుంటోంద‌ని 119 సీట్ల‌కు గాను 80 సీట్లు వ‌స్తాయ‌ని , తిరిగి బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు సాధిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. మంగ‌ళ‌వారం ఆయ‌న రోడ్ షోలో పాల్గొన్నారు.

Minister KTR Comment

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆరు నూరైనా స‌రే , కాంగ్రెస్ ఎన్ని కుట్ర‌లు చేసినా తాము విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు కేటీఆర్(Minister KTR). దేశంలో ఎక్క‌డా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయ‌ని తెలిపారు.

రాష్ట్ర స‌ర్కార్ ఆచ‌రిస్తుంద‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తుంద‌ని పేర్కొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అవుతుంద‌న్నారు. ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే 4వ తేదీన తాను నిరుద్యోగులతో తిరిగి ములాఖ‌త్ అవుతాన‌ని చెప్పారు.

ద‌శ‌ల వారీగా జాబ్స్ ను భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా 66 వేల‌కు పైగా జాబ్స్ ను భ‌ర్తీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో కొలువు తీరిన రాష్ట్రాల‌లో ఎన్ని ప్ర‌భుత్వ కొలువులు భ‌ర్తీ చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్.

ప్ర‌స్తుతం త‌మ గాలి వీస్తోంద‌ని, కారు ర‌య్ మంటూ దూసుకు వెళ్ల‌డం ఖాయ‌మన్నారు. త‌మ జోరుకు హ‌స్తం ప‌త‌నం అవుతుంద‌న్నారు మంత్రి కేటీఆర్.

Also Read : Vikas Raj : పోలింగ్ రోజు సెలవు ప్ర‌క‌టించాలి

Leave A Reply

Your Email Id will not be published!