Minister KTR : కేసీఆర్ సింహం లాంటోడు – కేటీఆర్
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి
Minister KTR : హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ సింహం లాంటోడని అన్నారు. ఆయనను ఢీకొనే సత్తా, మగోడు ఈ భూమి మీద ఇంకా పుట్ట లేదన్నారు. కనీసం 50 కేజీలు కూడా ఉండని తన తండ్రిని ఎదుర్కొనేందుకు అందరూ ఏకం అయ్యారని, అయినా లక్ష మంది పోటీ చేసినా సీఎంను తట్టుకునే శక్తి ఎవరికీ లేదన్నారు కేటీఆర్.
Minister KTR Praises CM KCR
సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుందని, ఎవరి మీద ఆధార పడటం అంటూ ఉండదన్నారు. కొందరు కావాలని టార్గెట్ చేస్తూ లేని పోని ఆరోపణలు చేస్తున్నారని, వారికి అంత సీన్ లేదన్నారు. ఆనాడు ఒక్కడే ఒంటరిగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన సమయంలో ఈ సోయిలేనోళ్లు ఒక్కడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు కేటీఆర్(Minister KTR).
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది గులాబీ జెండానేనని అన్నారు. బరా బర్ గెలుస్తున్నామని, డిసెంబర్ 9న ప్రగతి భవన్ సాక్షిగా తాము మరోసారి విజయ బావుటా ఎగుర వేస్తామన్నారు. ఇవాళ దేశానికే అభివృద్దిలో నెంబర్ వన్ గా ఉందన్నారు కేటీఆర్.
తెలంగాణ ఆచరిస్తే యావత్ భారత దేశం అనుసరిస్తోందని, ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు మంత్రి. ఏది ఏమైనా తమను ఢీకొనే సత్తా ఎవరికీ లేదని మరోసారి స్పష్టం చేశారు.
Also Read : Gunturu Karam : గుంటూరు కారం ఫస్ట్ సింగిల్