Minister Mahadevappa : హిందూమతంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి
వ్యక్తి ఎదుగుదలకు కరుణ, సమానత్వం ముఖ్యమని ప్రస్తావించారు...
Mahadevappa : హిందూమతంలో కులాల పిచ్చి కొనసాగుతోందని, ఎటువంటి మార్పులు రావడం లేదని బౌద్ద మతాన్ని స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప ప్రకటించారు. సోమవారం ధర్మచక్ర పరివర్తనా దినాన్ని పురస్కరించుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. హిందూమతంలో కులాల ప్రాధాన్యం జబ్బు వీడలేదని, ఇకపై మార్పులు వచ్చే లక్షణాలు కనిపించడం లేదన్నారు. స్వాతంత్య్రం, సమానత్వం, భ్రాతృత్వాన్ని బోధించే బౌద్ధ మతాన్ని ఇష్టపడతానని రాసుకున్నారు.
Mahadevappa Comments Viral
వ్యక్తి ఎదుగుదలకు కరుణ, సమానత్వం ముఖ్యమని ప్రస్తావించారు. కుల పిచ్చితో ఉన్న హిందూమతంలో మార్పు వచ్చే లక్షణాలు ఎక్కడా సాధ్యం కావడం లేదన్నారు. అలాంటి మార్పు త్వరలో రావాలన్నారు. అందుకే సమానత్వం, శాంతికి రూపమైన బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తానని ప్రకటించుకున్నారు. భారత మూలమతంగా బౌద్ధధర్మాన్ని ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా మైసూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు విజయవంతమయ్యేందుకు దాదాపు 20రోజులుగా మైసూరులోనే ఉంటూ పర్యవేక్షించారు. సాక్షాత్తు మంత్రే హిందూమతంపై విరుచుకుపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దసరా ముగిసిన ఒక్కరోజులోనే ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించడం సర్వత్రా చర్చకు కారణమవుతోంది.
Also Read : India-Canada : భారత్, కెనడా మధ్య రోజు రోజుకు ముదురుతున్న దౌత్య యుద్ధం