Minister Muthuswamy : తమిళ రాష్ట్రంలో విడతల వారీగా మద్యం దుకాణాల మూసివేతకు చర్యలు

మద్యం దుకాణాలు మూసేస్తే ఆ ప్రాంతంలోని మద్యం ప్రియులు ప్రశాంతంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పలేమన్నారు...

Minister Muthuswamy : రాష్ట్రంలో విడతలవారీగా మద్యందుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టనున్నామని గృహవసతి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఎస్‌. ముత్తుస్వామి(Minister Muthuswamy) తెలిపారు. మూసివేయనున్న టాస్మాక్‌ మద్యం దుకాణాల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలో ఆ దుకాణాల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఈరోడ్‌ ముత్తపాళయం సమీపంలోని పెరుంపల్లం కాలువ పూడికతీత పనులను మంత్రి ముత్తుస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… టాస్మాక్‌ దుకాణాలు మూసివేసియడంపై తమకెలాంటి సూత్రప్రాయమైన విభేదాలు లేవన్నారు.ఒకేరోజు మద్యం దుకాణాలు మూసివేస్తే ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

Minister Muthuswamy Comment

ఒక ప్రాంతంలో మద్యం దుకాణం మూసేస్తే, అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందా అనే విషయం పరిశీలించాల్సి ఉంటుందన్నారు. మద్యం దుకాణాలు మూసేస్తే ఆ ప్రాంతంలోని మద్యం ప్రియులు ప్రశాంతంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. మద్యం దుకాణాలు మూసే సమయంలో, వారిని ఆ అలవాటు నుండి దూరం చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టాస్మాక్‌ దుకాణాలపై సర్వే చేస్తే, విక్రయాలు పెంచడమ కోసమేనని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. టాస్మాక్‌ దుకాణాల్లో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయా, లేదా అనే విషయమై అధికారులు తనిఖీలు చేపడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడితే, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని, త్వరలోనే మూసివేసే దుకాణాల జాబితా విడుదల చేస్తామని మంత్రి ముత్తుస్వామి స్పష్టం చేశారు.

Also Read : CM MK Stalin : మంత్రివర్గంలో త్వరలో కీలక మార్పులు

Leave A Reply

Your Email Id will not be published!