Minister Nadendla : కాకినాడ పోర్ట్ లో స్మగ్లింగ్ ఘటనపై భగ్గుమన్న మంత్రి నాదెండ్ల మనోహర్

కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని....

Minister Nadendla : కాకినాడ పోర్ట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయని, దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla) పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రూ.12,800 కోట్లతో ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వంలో మంత్రిగా తాను తెనాలి నియోజకవర్గంలో పౌరసరఫరాల శాఖ గోడౌన్‌లో తనిఖీ చేశామని, ఆ తరువాత తనిఖీల్లో కూడా తూకాల్లో తేడాలు ఉన్నాయని చెప్పారు. 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడలో తనిఖీల్లో‌ పట్టుకున్నామన్నారు. 13 కంపెనీలపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. దీంతో వారు కోర్టుకు వెళ్లి బియ్యం విడుదలకు ఆదేశాలు తెచ్చారని.. వారి నుంచి 43.50 కిలోల వొప్పున ధర కట్టి బియ్యం వెనక్కి ఇచ్చామని మంత్రి తెలిపారు.

Minister Nadendla Manohar Comments

కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla) అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకు అని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సిఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని, రూ.16 వేల కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు.

గతంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ పదిహేను రోజులు సాగేదని, ఈ వ్యాన్ల ద్వారా జిల్లాల వారీగా ఒక నెట్ వర్కు ఏర్పాటు చేశారని, కిలో పది రూపాయల చోప్పున ప్రజల నుంచి రేషన్ బియ్యం కొని స్మగ్లింగ్‌కు పంపుతున్నారని అన్నారు. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి బాగా జరిగిందని.. అరవిందో నుంచి పోర్ట్ లాక్కుని మరీ బియ్యం ఎగుమతి చేశారని.. 23,51,218 కృష్ణపట్నం, 38,2000 మెట్రిక్ టన్నులు విశాఖ నుంచి పంపారని.. కాకినాడ పోర్ట్ నుంచి కోటి 30,18, 400 మెట్రిక్ టన్నుల బియ్యం.. అంటే సుమారు 48,537 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం ఎగుమతి చేశారని మంత్రి అన్నారు. దీని వెనుక ఎవరున్నారో బయటకు లాగుతున్నామని చెప్పారు.

కన్నబాబు, ద్వారంపూడి అప్పుడు ఎందుకు మాట్లాడడంలేదని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla) ప్రశ్నించారు. ఇన్ని కోట్ల అవినీతి జరిగితే గత పాలకులకు తెలియదంటే నమ్మాలా.. నిజంగా తెలియలేదంటే… అది గత ఐదేళ్లుగా ప్రభుత్వం అసమర్థత కాదా.. అని నిలదీశారు. రేషన్ బియ్యం మాఫీయా జగన్ హయాంలొ రెచ్చిపోయిందని, జగన్ పోర్ట్‌ను తన ఆధీనంలోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.

బెదిరించి, భయపెట్టి అరబిందో కు పార్టనర్ షిప్ కట్టపెట్టారని, ఈ రేషన్ మాఫియాను పూర్తి గా అరికట్టాలని మంత్రి నాదెండ్ల అన్నారు. తమ వంతుగా ఇందుకోసం చాలా కృషి చేస్తున్నామని, పవన్ కళ్యాణ్ అంత లోపలకి వెళ్లారంటే అది ప్రజల కోసమేనని అన్నారు. పేదల బియ్యం కాపాడాలనే తపనతో మేము పని చేస్తున్నామని, వ్యవస్థలను మార్చడానికి తాము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, దళారుల వ్యవస్థను కూడా పూర్తి గా అరికట్టాలని అన్నారు. ఈ‌ ప్రక్షాళనలో సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సహకారం అందిస్తున్నారని, రాష్ట్రంలో రేషన్ అక్రమాలు అరి కట్టేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Also Read : TG Governor : దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలి

Leave A Reply

Your Email Id will not be published!