Minister Nara Lokesh : మామ బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్

తిరుమలలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు...

Nara Lokesh : పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు పండుగలా ఆయన జన్మదిన వేడుకలను చేసుకుంటున్నారు. కేకులు కట్ చేసి బాలకృష్ణకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రోడ్డు షోలు నిర్వహించి బాలయ్యపై అభిమానం చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య’ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు లోకేష్.

Minister Nara Lokesh Wishes

తిరుమలలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద 650 టెంకాయలు కొట్టి.. 6.5 కిలోల కర్పూరాన్ని వెలిగించి టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మొక్కులు చెల్లించుకున్నారు. సామాజిక సేవలు చేస్తూ సామాన్య ప్రజలకు బాలకృష్ణ ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. బసవతారకం ట్రస్టు ద్వారా ఎందరికో వైద్య సేవలు అందిస్తున్నారని ఉద్ఘాటించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండటంతో పాటు ప్రజలకు మరింత సేవ చేయాలని స్వామి వారిని ప్రార్ధించి మొక్కులు చెల్లించుకున్నామని శ్రీధర్ వర్మ పేర్కొన్నారు.

Also Read : Dhiman Chakma IAS: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యంగ్ ఐఏఎస్‌

Leave A Reply

Your Email Id will not be published!