Minister Nara Lokesh : చేనేత మహిళలకు అండగా మంత్రి లోకేష్ ఆర్థిక సహకారం

ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ....

Nara Lokesh : చేనేత రంగంలో మహిళలు రాణించాలని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తా మని హామీ ఇచ్చారు. మంగళగిరి–విజయవాడ బైపాస్‌‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(పీఐడబ్ల్యూఏ)ఆధ్వర్యంలో నూతన పద్మశాలీ భవన్‌ను నిర్మిస్తున్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌‌(Nara Lokesh)కు పీఐడబ్ల్యూఏ సభ్యులు, కూటమి నేతలు, కార్యకర్తలు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేనేతలతో కలిసి మంత్రి లోకేష్ ఫొటోలు దిగారు.

Minister Nara Lokesh….

ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్‌ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామని అన్నారు. చేనేత వర్గానికి చెందిన పేద విద్యార్థులు, చేనేత కుటుంబాలకు దాదాపు రూ. 3 కోట్లకు పైగా సహాయ సహకారాలు అందించినట్లు గుర్తుచేశారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. 17 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రారంభమైన పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.. ఏపీవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు. పీఐడబ్ల్యూఏ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా, అభివృద్ధి కార్యక్రమాలు, నూతన పద్మశాలి భవన్‌ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ అడిగి తెలుసుకున్నారు.

Also Read : Ponnam Prabhakar : సమగ్ర కుటుంబ సర్వేలో కీలక అంశాలను వెల్లడించిన మంత్రి పొన్నం

Leave A Reply

Your Email Id will not be published!