Minister Narayana : విశాఖ మెట్రో డెవలప్మెంట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి
దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ఫీజిబుల్ రిపోర్టు తయారు చేసి ఇవ్వమన్నారని....
Minister Narayana : విశాఖ మెట్రోల రైలుపై మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) శుభవార్త చెప్పారు. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారభించనునున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2018లో మెట్రోరైల్ టెండర్‌ల వరకూ వెళ్లిపోయిందని.. అయితే విశాఖపట్నం ఓ ప్యాలెస్ కట్టుకోవడానికే పరిమితం అయ్యారని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. కోల్‌కతాలో మొత్తం మెట్రోకు కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విభజన చట్టంలో ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. మెట్రోరైల్ ఫస్ట్ ఫేజ్‌లో మరో ఆరు కిలోమీటర్లు పెంచితే మరింత ఉపయోగం ఉంటుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
Minister Narayana Comment
దీనిపై మంత్రి నారాయణ(Minister Narayana) మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ఫీజిబుల్ రిపోర్టు తయారు చేసి ఇవ్వమన్నారని.. 2015లో డీపీఆర్ తయారు చేసి ఇచ్చామని తెలిపారు. అప్పుడు మీడియం మెట్రో అన్నారని.. 2016లో పీపీపీ మాడల్‌లో చెప్పారన్నారు. న్యూ మెట్రో పాలసీ ప్రకారం ధరఖాస్తు చేయమని తరువాత చెప్పారని తెలిపారు. ఢిల్లీ మెట్రో అధికారులు విశాఖ, విజయవాడకు లైట్ మెట్రోను సిఫారస్సు చేశారన్నారు. గతంలో ఇచ్చిన టెండర్లను వైసీపీ ప్రభుత్వం 2019లో క్యాన్సిల్ చేసిందని అన్నారు. అప్పటి ప్రభుత్వానికి మెట్రో చేయాలనే ఉద్దేశమే లేదని విమర్శించారు. అయితే కేంద్రంతో మాట్లాడి కలకత్తా మోడల్‌లో మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకువవెళతామని స్పష్టం చేశారు.
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై సమగ్ర రవాణా ప్రణాళికను (సీఎంపీ) సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లుచెప్పారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం విశాఖ, విజయవాడకు మెట్రో రైల్ రాకుండా కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు పొడిగించాలనే సాకుతో డీపీఆర్‌ను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో ప్రాజెక్ట్‌పై స్వయంగా కేంద్రమంత్రిని కలిసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారన్నారు. విశాఖపట్నంలో మొత్తం 76.90 కిలో మీటర్ల మేర రెండు ఫేజ్‌లలో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపడతామని అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటించారు.
Also Read : KTR : పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పై వారి ఫ్యామిలీకి వెర్బల్ గ మాట్లాడి ధర్యం చెప్పిన కేటీఆర్