Minister Narayana : రేరాపై వస్తున్న వరుస ఫిర్యాదులకు స్పందించిన మంత్రి నారాయణ
నేక అంశాల పై ఈరోజు వారితో చర్చించాం...
Minister Narayana : రెరా అధికారులపై మంత్రి నారాయణ(Minister Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రెరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు. ఎనిమిది నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే దరఖాస్తురాదులను వేధింపులకు గురి చేస్తునట్లు మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ(Minister Narayana) ఆరా తీశారు. రెరా అధికారులతో నారాయణ(Minister Narayana) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఏపీ రెరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని.. 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావడంలేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు.
Minister Narayana Comments
‘‘మా సమాచారం అందుకుని 30 మంది క్లయింట్లు, ప్రతినిధులు వచ్చారు. అనేక అంశాల పై ఈరోజు వారితో చర్చించాం. ఇబ్బందులు పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేశాం. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను కూడా కొన్ని పరిశీలీంచాం. కమిటీ వేసి మరింత సరళతరంగా ఉండేలా చూస్తాం. అపార్ట్‌మెంట్, విల్లాలుకొనే వారు నష్టపోకుండా చూస్తాం. ప్రకటనలు చూసి కొనేవారు మోసపోకూడదనే రెరా తీసుకు వచ్చాం. అక్కడ ఉన్న సదుపాయాలు అగ్రిమెంట్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది రెరా అధారిటీ పరిశీలిస్తుంది. నాలుగైదు అంశాలు మినహా అన్ని సమస్యలు పరిష్కరించాం’’ అని మంత్రి వెల్లడించారు. 2016 లో రెరా చట్టం అమల్లోకి వస్తే 2017 నుంచి నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. 167 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా ఈనెలాఖరుకు పరిష్కరించాలని ఆదేశించామన్నారు.
గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఆఫ్ లైన్‌లో జరిగే విధానాన్ని ఆన్ లైన్‌లోకి తెస్తామన్నారు. టీడీఆర్ బాండ్‌లను తాత్కాలికంగా అన్ని చోట్లా ఆపామన్నారు. తణకు అంశంపై విచారణ పూర్తి అయ్యాక సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని తెలిపారు. శుక్రవారం , శనివారం మధ్యాహ్నం మున్సిపల్ కమీషనర్‌లతో మాట్లాడానని.. ఈరోజు సాయంత్రం కూడా కాన్ఫరెన్స్ పెట్టినట్లు చెప్పారు. 822 టీడీఆర్‌లు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈనెలాఖరులోపు వీటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశఆరు. విశాఖలో అత్యధికంగా 184 టీడీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందాలని.. అనుమతుల విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. అన్ని రకాల నిబంధనలు పరిశీలించి సరళ తరం చేస్తామన్నారు. సెంట్రల్ యాక్ట్ ప్రకారం లిబరైజ్ చేస్తున్నామని వెల్లడించారు.
బిల్డర్లు కూడా నిబంధనలు పాటించి నిర్మాణాలు చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా మంది బిల్డింగ్‌లు నిర్మించారని.. సెంట్రల్ యాక్ట్ ప్రకారం మార్పులను రెరా సూచనలు చేస్తుందన్నారు. బిల్డర్లకు పూర్తిగా చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. డబ్బు పెండింగ్‌లో ఉన్నప్పటికీ కొంతమంది ఫిర్యాదు చేస్తున్నారన్నారు. కోర్టులో ఉన్న అంశాలు అక్కడ పరిష్కారం అయ్యాకే అనుమతి ఇస్తామని తెలిపారు. నూతననంగా విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ‘‘ రెరాపై ఫిర్యాదులు వచ్చాయనే నేను ఈరోజు పరిశీలీంచా. యాక్ట్‌లో లేని అంశాలు కొన్ని పెట్టినందున కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆఫ్‌లైన్ కాకుండా ఇక ఆన్‌లైన్‌లోనే రెరా కార్యకలాపాలు వచ్చే నెల నుంచి అమలు చేసేలా చూస్తాం’’ అని మంత్రి నారాయణ(Minister Narayana) ప్రకటించారు.
Also Read : Minister Nara Lokesh : ఉద్యోగాల భర్తీపై ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు