Minister Narayana : నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతాం

ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు...

Minister Narayana : నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామమని చెప్పారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఇవాళ(శనివారం) ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం 5.30 గంటల నుంచి క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులు పరిశీలించారు. 52వ డివిజన్ రంగనాయకుల పేటలో పర్యటించి ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

Minister Narayana Comment

ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. గోపురం వీధిలో పారిశుధ్య సమస్య ఉందని స్థానికులు తెలపడంతో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌లో శానిటేషన్‌పై మంత్రి నారాయణ స్థానికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Also Read : Jharkhand Ex CM : బీజేపీలో చేరిన ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్

Leave A Reply

Your Email Id will not be published!