Minister Nimmala : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై కీలక సమీక్షా ఏర్పాటు చేసిన మంత్రి
ఎక్కడా ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గాని జరగకూడదన్నారు...
Minister Nimmala : ఏపీలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపై రాష్ట్రంలో భారీగా వర్షాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala) మాట్లాడుతూ.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.
Minister Nimmala Comment
ఎక్కడా ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గాని జరగకూడదన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని ఆదేశించారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ తదితర సామాగ్రి సిబ్బందితో రెవెన్యూ అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. తీర ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాలలో తుఫాన్ రక్షిత భవనాలను సిద్ధం చేసుకుని అవసరమైన బోట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. పాము కాటు,విష జ్వరాలు, డయారియా వంటి వాటితో పాటు అన్ని రకాల మందులతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పడవలు, వలలు ఇతర పనిముట్లు భద్రపరుచుకోవడంతో పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ముంపు ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను, దీర్ఘవ్యాధిగ్రస్తులను గుర్తించి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏటి గట్ల పటిష్టతకు ఇసుక బస్తాలు, సర్వే బాదులు సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
Also Read : Minister Ravi Kumar : విద్యుత్ అధికారులతో భేటీ అయిన మంత్రి గొట్టిపాటి