Minister Nimmala : మాజీ మంత్రి అంబటి పై భగ్గుమన్న ఇరిగేషన్ మంత్రి నిమ్మల

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు అసలు మీకు ఎవరు చెప్పారు?..

Minister Nimmala : వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala) ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అంటూ విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిద్రపోయే వాణ్ణి లేపవచ్చు.. నిద్ర నటించే వాణ్ణి ఎవరు లేపగలరు? అంటూ సెటైర్లు వేశారు. అలాగే అంబటికి అన్నీ తెలుసని, అయినా వాళ్ల పార్టీ అధినేత మెప్పుకోసం ఆయన చెప్పిన అబద్ధాలనే ఈయన పదేపదే చెబుతున్నారన్నారు.

Minister Nimmala Slams..

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు అసలు మీకు ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండని అంబటిని మంత్రి నిమ్మల(Minister Nimmala) నిలదీశారు. మాకు తెలియకుండా మీ వైయస్సార్ పార్టీకి, నేతలకు మాత్రమే పంపారా! పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకు పెంచి పూర్తి చేస్తామని నేను చెబితే సరిపోదా.. ప్రధాని మోదీ, కేంద్ర జల శక్తి మంత్రితో చెప్పించాలని అనడానికి మీకు అసలు సిగ్గుందా! అంటూ నిమ్మల ఫైర్ అయ్యారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలేనని.. తమది డబల్ ఇంజిన్ సర్కార్ అని.. ఆ విషయం గుర్తేరిగి మాట్లాడండి అని మంత్రి నిమ్మల వైసీపీ నేత అంబటికి వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట, ఒకటే బాట అని వ్యాఖ్యానించారు.

మా అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పోలవరం, అమరావతి రెండూ, రెండు కళ్ళు అని ప్రగతి, సంక్షేమం ఆయనకు సమప్రాధాన్యం అని చెప్పుకొచ్చారు. అందువల్ల పోలవరాన్ని సాంకేతిక సలహా మేరకు ముందుకు తీసుకువెళతామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మాకు 100కు 150 శాతం చిత్తశుద్ధి ఉందన్నారు. పోలవరం అవశ్యకత మీకంటే మాకు బాగా తెలుసని.. ప్రాజెక్టు ఎత్తుని 41.15 మీటర్లకు కుదించేలా చంద్రబాబు కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకుని ఆ విషయం గోప్యంగా ఉంచినట్టు అంబటి ఆరోపించడం చూస్తే ఆయన మానసిక పరిస్థితి మీద డౌట్ వస్తుందని చురకలు వేశారు.

అక్టోబర్ 9న ఇచ్చిన రూ. 2348 కోట్లు మళ్ళించామనడం ఇదొక తప్పుడు ఆరోపణన్నారు. నిరూపించే దమ్ముందా మీకు? అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత సాంకేతిక ప్రమాణాల మేరకు నిర్మించి తీరుతామన్నారు. ఆంధ్రుల అభిమానాన్ని శాశ్వతంగా చూరగొంటామని.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని కామెంట్స్ చేశారు. మీరు అబద్ధాలు మానేయండి. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మసక బారిన మీ పార్టీ బతికి బట్ట కట్టడం కష్టం అంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Minister Ponguleti : తెలంగాణ సీఎం మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

Leave A Reply

Your Email Id will not be published!