Minister Nimmala : మరికాసేపట్లో విజయవాడ ప్రజలకు బుడమేరు నుంచి విముక్తి

మరోవైపు బుడమేరు శాంతించే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు...

Minister Nimmala : బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. రాత్రి వేల కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala) దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడిక పూర్తి అవుతుందన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి సింగ్ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమ కష్టం ఎంత అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కాగా.. క్షేత్రస్థాయిలో ఉండి పనులను నిమ్మల పర్యవేక్షిస్తుంటే.. మంత్రి లోకేష్ బుడమేరు మూడవ గండి పూడ్చివేత పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రివేళ కూడా పనులను కొనసాగించారు.

Minister Nimmala Comment

మరోవైపు బుడమేరు శాంతించే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. పశువుల సంరక్షణ కోసం వరద నీటిలోనే పలు కుటుంబాలు కాలం గడివుతున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం… ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యాయి.

Also Read : Vistara Flight: టర్కీలో అత్యవసరంగా ల్యాండైన ముంబై – ప్రాంక్‌ఫర్డ్ విమానం !

Leave A Reply

Your Email Id will not be published!