Minister Parthasarathy : ఏపీలో ‘హైడ్రా’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి

వైసీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు...

Minister Parthasarathy : తెలంగాణ రాష్ట్రం తరహాలో ఏపీలో కూడా హైడ్రాను తీసుకువస్తామని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఏపీలో కూడా చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఆరోపించారు. ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ… త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

Minister Parthasarathy Comment

వైసీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు.

Also Read : KK Survey : రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై కెకె సర్వే కీలక రిపోర్ట్

Leave A Reply

Your Email Id will not be published!