Minister Payyavula : ఏపీకి ఉన్న అప్పులపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
బ్రాండ్ చంద్రబాబు పేరుతో రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నామని చెప్పుకొచ్చారు...
Minister Payyavula : ఏపీలో ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula) తెలిపారు. అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపై చెప్పడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని అసెంబ్లీలో పెట్టామని గుర్తుచేశారు. ఆ తర్వాత శాసనసభ, శాసన మండలిలోనూ చర్చించామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతి దయనీయమైన పరిస్థితిలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula) చెప్పారు.
Minister Payyavula Keshav Comments
బ్రాండ్ చంద్రబాబు పేరుతో రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రాన్ని ముందుకు నెట్టగలుగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99 శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోతుందని అన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
అప్పులుచేయడం తప్పు కాదు… చేసిన అప్పులను అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోతుందని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని ఈ విధంగా పెంచుకోవాలనే దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. ఎంత పెంచిన జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను అధిగమించడానికి చాలా కాలం శ్రమ పడాల్సి వస్తోందన్నారు. అప్పుల మీద వడ్డీని తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీని తీర్చడానికి కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
Also Read : Minister Komatireddy : కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలపై భగ్గుమన్న మంత్రి కోమటిరెడ్డి