Minister Payyavula : ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు కలిసి పనిచేద్దాం

ఒక లక్షా 14 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు...

Minister Payyavula : ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కలెక్టర్ల సమావేశంలో చర్చించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula) అన్నారు. బుధవారం ఏపీ కలెక్టర్ల సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. 1994 నుంచి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నానని.. చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో ఇప్పుడూ అదే తపనతో ముందుకెళ్తున్నారన్నారు. ప్రజల కోసమే జీవితం, ప్రతి పనిలోనూ మానవత్వం అనే లక్ష్యంతో పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిందన్నారు. అంతకుముందు రెండేళ్లు 107 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించారని చెప్పారు.

Minister Payyavula Comment

ఒక లక్షా 14 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని.. వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా బాధనిపిస్తోందని అన్నారు. అధికారంలోకి రాగానే అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, మరోవైపు ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎదురయ్యాయని తెలిపారు. మరో వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్థితి కానీ సీఎం చంద్రబాబు ప్రజాక్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారన్నారు. . హైదరాబాద్ ట్రాన్స్ ఫార్మ్ చేసినట్టే రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారన్నారు. ప్రభుత్వశాఖలు ప్రతీ రూపాయినీ జాగ్రత్తగా ఆలోచించి ఖర్చుపెట్టాలని సూచించారు. ఈ రాష్ట్రాన్ని పునర్మించడానికి అంతా కలసి పని చేద్దామన్నారు. సీఎం టీమ్‌గా ప్రజల కోసం పనిచేద్దామంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు.

Also Read : A P Jithender Reddy : ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!