Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి
టోల్‌ఫ్రీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు...
Minister Ponguleti : తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్ మెంట్‌ను పూర్తిగా పక్కకు పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తప్పులు దొర్లకుండా నిజమైన ఇందిరమ్మ లబ్ధి దారులను ఎంపిక చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాకో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించామని గుర్తుచేశారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తామని వివరించారు. ఇవాళ(మంగళవారం) ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ… 80 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పారు. ఇందిరమ్మ యాప్ ను ఏర్పాటు చేసి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వినియోగిస్తామని అన్నారు. డిజైన్ అంటూ ప్రభుత్వం ఏం నిర్ణయించలేదని చెప్పారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు నిర్మించుకోవచ్చని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వేయదని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉండొద్దని చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో ఒక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
Minister Ponguleti Comment..
టోల్‌ఫ్రీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏవైనా అనుమానాలు ఉంటే వెబ్ సైట్లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్, ఇసుకపై కేబినెట్లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి లేదని అన్నారు. పేదవాడు అయితే పింక్ షర్ట్ వేసుకున్నా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు విజిలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Also Read : Congress-SC : ఎన్నికల ప్రక్రియలో మార్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్