Minister Ponnam-KTR : ఢిల్లీ ఫలితాల అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆప్‌ను దెబ్బకొట్టడం వల్లే బీజేపీ గెలిచిందన్నారు కేటీఆర్‌..

Minister Ponnam : ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో హీట్‌ పుట్టించాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్ రాహుల్‌ గాంధీపై సెటైర్లు వేశారు. బీజేపీని గెలిపించినందుకు రాహుల్‌కి కంగ్రాట్స్‌ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొడుతూ.. కాంగ్రెస్‌ బీజేపీకి మేలు చేస్తోందన్నారు కేటీఆర్. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆప్‌ను దెబ్బకొట్టడం వల్లే బీజేపీ గెలిచిందన్నారు కేటీఆర్‌(KTR).

Minister Ponnam Comments

ఢిల్లీలో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ పరాజయంలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి పాత్ర అమోఘం అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి ఇతర రాష్ట్రాల్లో రేవంత్‌ ఎన్నికలప్రచారం చేసుకోవాలన్నారు. లేదంటే ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు వస్తాయన్నారు హరీశ్‌.

కేటీఆర్‌ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్‌కి ఆనందం కలిగిస్తున్నట్టు ఉందన్నారాయన. కేసుల మాఫీ కోసమే కేటీఆర్ బీజేపీకి మద్దతు గా నిలుస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అండతో దోచుకుని ఇప్పుడు అధికారం పోయాక కేసుల నుంచి విముక్తి కోసం బీజేపీ భజన చేస్తున్నారన్నారు. దేశాన్ని ఏలుతామంటూ పార్టీ పేరు మార్చుకున్న పార్టీ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు పొన్నం.

Also Read : Delhi Results 2025-Modi : ఢిల్లీలో బీజేపీ గెలుపు అనంతరం మోదీ రియాక్షన్

Leave A Reply

Your Email Id will not be published!