Minister Ponnam Prabhakar : అధికారులంతా 24/7 పని చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి

అధికారులంతా 24/7 పని చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి..

Minister Ponnam : ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినందున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని మంత్రి కోరారు. 33 జిల్లాల కలెక్టర్లు, గ్రామ కార్యదర్శి మొదలు సీఎస్‌ వరకు 24/7 అధికారులందరూ పనిచేయాలని ఆదేశించారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‏గౌడ్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అనుదీప్‌ దురిశెట్టి, శశాంకతో కలిసి హిమాయత్‌సాగర్‌ జలాశయాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.

Minister Ponnam Prabhakar Orders..

ఈ సందర్భంగా పొన్నం(Minister Ponnam) మాట్లాడుతూ హిమాయత్‌సాగర్‌ జలాశయం నిండినా, దిగువున ఉన్న ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 5 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తే, 10 గంటల్లో జలాశయం నిండి ఓవర్‌ ఫ్లో అవుతుందని, ప్రభుత్వపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విపత్కర సమయంలో రాజకీయాలు చేయడం తగదని విపక్షాలకు సూచించారు. అసెంబ్లీలో, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాల గురించి చూసుకుందామన్నారు. ఒకరు అమెరికాలో, మరొకరు ఫాంహౌస్‏లో ఉండి సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేయడం సరికాదన్నారు. భారీ వర్షాలకు 5వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. తక్షణం 2 వేల కోట్లు ఆర్థిక సహకారం చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. మంత్రి వెంట బండ్లగూడ మేయర్‌ లతాప్రేమ్‌గౌడ్‌, తెలంగాణ ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బి. జ్ఞానేశ్వర్‌, ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.

Also Read : YS Sharmila: J² (జిందాల్ – జగన్) స్కీములేసుకొని కాదంబరి కథ నడిపించారు – వైఎస్‌ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!