Minister Ponnam Prabhakar : నెక్లెస్ రోడ్డులో ఆర్థోపెడిక్ వాక్ థాన్ ను ప్రారంభించిన మంత్రి
ప్రజలు తమ జీవితంలో రోజువారీగా వాకింగ్, రన్నింగ్..
Ponnam Prabhakar : నెక్లెస్ రోడ్డులో ఆర్థోపెడిక్ వాక్ థాన్ ఇవాళ(ఆదివారం) జరిగింది. జెండా ఊపి వాక్ థాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆర్థోపెడిక్ వాక్ థాన్‌లో వందలాది మంది వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్థోపెడిక్‌పై అవగాహన కల్పిస్తూ ఇలాంటి వాక్ థాన్‌లు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. మనిషి శరీరంలో ఎముకలు కీలకం.. ఎముకలు దృఢంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
Minister Ponnam Prabhakar Comment
ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరమని చెప్పారు. ప్రజలు తమ జీవితంలో రోజువారీగా వాకింగ్, రన్నింగ్ చేయడం అవసరమని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి అవగాహన వాక్ థాన్స్ నిర్వహించాలి, అందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. వైద్య పరంగా వస్తున్న మార్పుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Also Read : Minister Kishan Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు