Rajendra Pal Gautam : మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా
మత మార్పిడి కార్యక్రమానికి హాజరు వివాదం
Rajendra Pal Gautam : ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన కీలక ప్రకటన చేశారు. మత మార్పిడి కార్యక్రమానికి హాజరయ్యారు. 10,000 మంది బౌద్దమతాన్ని స్వీకరించాల్సిన ఝుండే వాలన్ లోని అంబేద్కర్ భవన్ లో జరిగిన అశోక విజయ దశమి వేడుకలకు రాజేంద్ర పాల్ గౌతమ్ హాజరయ్యారు.
అక్టోబర్ 5న ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఆప్ మంత్రి గౌతమ్ పోస్ట్ చేశారు. మత మార్పిడి కార్యక్రమానికి మంత్రి హాజరు కావడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిని తీవ్రంగా తప్పు పట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే మద్యం స్కాం, విద్యుత్ సబ్సిడీ, మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..ఇలా ఢిల్లీ ఆప్ సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది.
తాజాగా రాజేంద్ర పాల్ గౌతమ్ కేబినెట్ నుంచి తప్పుకోవడం ఒక రకంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద దెబ్బేనని చెప్పక తప్పదు. రాజీనామా చేసిన అనంతరం రాజేంద్ర పాల్ గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని అనేక కోట్ల మంది ప్రజలు పునరావృతం చేసే ప్రమాణాల నుండి ఇటువంటి సమస్య సృష్టించబడింది.
బీజేపీ దీన్ని సమస్యగా మార్చింది. నన్ను , నా పార్టీని అవమానించేందుకు ప్రయత్నం చేస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గౌతమ్. ఇదిలా ఉండగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని కలిసి మంత్రిపై ఫిర్యాదు చేసింది.
Also Read : మునుగోడులో గెలుపు బీజేపీకి మలుపు