Minister Rajnath Singh: ఉదయగిరి, హిమగిరి నౌకలను నావికాదళంలోనికి ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి
ఉదయగిరి, హిమగిరి నౌకలను నావికాదళంలోనికి ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి
Minister Rajnath Singh : ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్‌ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరిలను జల ప్రవేశం చేసాయి. తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రమైన విశాఖపట్నంలోని డాక్‌యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Minister Rajnath Singh)… వీటిని జాతికి అంకితం చేసారు. నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్‌కుమార్ త్రిపాఠి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అడ్మిరల్ విఎస్ షెకావత్, సునీల్ లాంబ ఇతర నేవీ అధికారులు పాల్గొన్నారు.
Defence Minister Rajnath Singh Key Updates
ఇండో-పసిఫిక్, చైనా ప్రాంత సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పీ-17 పేరిట స్వీయ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్‌కతా, ముంబయిలలో ఈ యుద్ధ నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది. 6,670 టన్నుల బరువు, 28 నాటికల్స్ మైళ్ల వేగం, ఆధునిక సెన్సార్ వ్యవస్థ ఈ నౌకల సొంతం. ఈ నౌకల మీద నుంచి సూపర్ సోనిక్, బ్రహ్మోస్ వంటి అస్త్రాలను నింగిలోని లక్ష్యాలకు ప్రయోగించవచ్చు. ఈ నౌకల పొడవు దాదాపు 149 మీటర్లు. భీకర పోరు సాగించే ఆధునిక ప్రత్యేకతలు కలిగిన ఈ నౌకలు భారత నౌకాదళానికి వెన్నుదన్నుగా నిలవబోతున్నాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Minister Rajnath Singh) మాట్లాడుతూ… భారతదేశం దుందుడుకు వాదాన్నిఎప్పుడూ నమ్మదని… ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయము… లేదా చేసే విధంగా ఎవరినీ రెచ్చగొట్టము… కానీ మన భద్రతకు ముప్పు ఎదురైనప్పుడు ఎలా ప్రతిస్పందించాలో మనకు తెలుసని రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. అత్యాధుని ఆయుధ సంపత్తిని సమకూర్చడం ద్వారా ప్రపంచ దేశాల ముందు బల ప్రదర్శన చేయడం భారత్ యొక్క ముఖ్య ఉద్యేశ్యం కాదని… మనకు హాని తలపెట్టే శత్రు దేశాలకు గట్టి సందేశం ఇవ్వడం కూడా ముఖ్యమన్నారు. విశాఖ డాక్ యార్డ్ లో భారత నౌకాదళానికి చెందిన నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగేట్లు ఐఎన్‌ఎస్ ఉదయగిరి (INS Udaygiri), ఐఎన్‌ఎస్ హిమగిరి (INS Himgiri) నౌకలను ఆయన విధుల్లో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఐఎన్‌ఎస్ ఉదయగిరి(INS Udaygiri) నౌకను నిర్మించిన ముంబయిలోని మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్)ను… అదే విధంగా ఐఎన్‌ఎస్ హిమగిరి (INS Himgiri) ని నిర్మించిన కోల్‌కతాలోని గార్డెన్ రిచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) ను ఆయన ప్రశంసించారు. భారత నౌకాదళానికి చెందిన నీలగిరి శ్రేణి కి చెందిన ఈ యుద్ధనౌకలు భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం, సముద్ర ప్రయోజనాలను కాపాడటంతో పాటు మానవతా సహాయం & విపత్తు సహాయ కార్యకలాపాలలో కూడా సహాయపడతాయని ఆయన తెలిపారు.
INS ఉదయగిరి మరియు INS హిమగిరి నావికాదళం యొక్క పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో “ఫస్ట్ రెస్పాండర్” మరియు “ఫ్రిఫర్డ్ సెక్యూరిటీ పార్టనర్”గా పనిచేస్తాయన్నారు. “పైరసీని ఎదుర్కోవడం, స్మగ్లింగ్ మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడటం, సముద్ర ఉగ్రవాదాన్ని అరికట్టడం లేదా ప్రకృతి వైపరీత్యం తర్వాత ఉపశమనం అందించడం వంటి వాటి నుండి, ఈ యుద్ధనౌకలు సంక్లిష్టమైన మరియు ప్రమాదకర కార్యకలాపాలలో గేమ్-ఛేంజర్‌గా ఈ నౌకలు పనిచేస్తాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలు (ఆర్మీ,నేవీ, ఎయిర్ ఫోర్స్) లతో పాటు ఇతర భద్రతా సంస్థలు/విభాగాల మధ్య సమన్వయం… దేశం ప్రతి సవాలులోనూ ఐక్యంగా ఉండి… దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని రుజువు చేసాయన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలలుకన్న ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఒక పెద్ద ముందడుగుగా, ప్రభుత్వ దార్శనికత మరియు నిబద్ధతకు నిదర్శనంగా వీటిని రక్షణ మంత్రి అభివర్ణించారు. “INS ఉదయగిరి & INS హిమగిరి ప్రభుత్వ స్వావలంబన పట్ల దృఢ సంకల్పానికి ప్రకాశవంతమైన ఉదాహరణలు, పరివర్తనాత్మక ఉద్యమానికి చిహ్నాలు మరియు అన్ని వాటాదారుల సమిష్టి ప్రయత్నాలతో దేశం మరింత ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని మరియు స్వావలంబన లక్ష్యాన్ని సాధిస్తుందనే దార్శనికతకు నిదర్శనం” అని ఆయన అన్నారు.
Also Read : CM Revanth Reddy: రాహుల్ తో కలిసి ‘ఓటర్ అధికార్’ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
