Murder: అనకాపల్లిలో దారుణం ! కన్నతల్లిని హతమార్చిన కుమార్తెలు !

అనకాపల్లిలో దారుణం ! కన్నతల్లిని హతమార్చిన కుమార్తెలు !

Murder : తల్లి ప్రవర్తనతో మనస్తాపం చెందిన కూతుళ్లు… బాబాయ్‌తో కలిసి ఆమెను హత్య చేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Anakapalli Murder Shocking

ఒడిశాకు చెందిన బంకెల సంతు(37) భర్తతో విడిపోయి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కుర్మానపాలెం వడ్లపూడి రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. పెద్దకుమార్తె అనుష ఓ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. 15 ఏళ్ల చిన్న కుమార్తె ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుకుంటోంది. అయితే తల్లి సంతు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు లోనై డబ్బులు వృథా చేసింది. దీనిపై తరచూ సంతుకి మరిది మురళీధర్‌, ఇద్దరు కుమార్తెలకి మధ్య వివాదం జరిగేది.

ఇది ఇలా ఉండగా ఇటీవల తల్లి మొబైల్‌ లో అసభ్యకర దృశ్యాలు ఉండటం చిన్న కుమార్తె చూసింది. విషయాన్ని అక్కకి చెప్పడంతో గొడవ జరిగింది. తల్లి ప్రవర్తనపై విసుగు చెందిన కుమార్తెలు… బాబాయ్‌ మురళీధర్‌ సాయంతో అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ఇంట్లో నిద్రిస్తున్న సంతుని హత్య (Murder) చేసి… మృతదేహాన్ని కారులో సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద పెట్రోల్‌ పోసి దహనం చేశారు. అయితే సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు.

Also Read : Minister Rajnath Singh: ఉదయగిరి, హిమగిరి నౌకలను నావికాదళంలోనికి ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!