Minister Ramprasad : రవాణా శాఖలో ప్రక్షాళన కు కీలక ఉత్తర్వులు జారీచేసిన మంత్రి

అక్రమంగా వెళ్తున్న వాహనాలను పట్టుకోకపోవడమేంటని ఆర్టీఎ అధికారులను ప్రశ్నించారు..

Minister Ramprasad : రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రి చర్చించారు. రవాణా శాఖలో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సీరియస్ అయ్యారు. గత ఐదేళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లాయని ఆరోపించారు.

Minister Ramprasad Comment

అక్రమంగా వెళ్తున్న వాహనాలను పట్టుకోకపోవడమేంటని ఆర్టీఎ అధికారులను ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో అక్రమంగా ఇసుక, ఖనిజాలు తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad) మీడియా సమావేశం నిర్వహించారు. అక్రమంగా ఇసుక, మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఒకే నెంబర్‌తో పలు వాహనాలు తిరుగుతున్నాయని వాటిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నిరంతరం తనిఖీలు చేసి అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఎ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గత ఐదేళ్లలో రవాణా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సమూల ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.

రవాణాశాఖలో అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అక్రమార్కుల పనిపట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వైసీపీ పాలనలో ఆర్టీసీలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల 2019-24 మధ్య ఆర్టీసీ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం చెల్లించని బకాయిలు, సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అమరావతి బ్రాండ్ ఎసీ బస్సులను పూర్వవైభవం తీసుకువస్తామని ఉద్ఘాటించారు. ఒవర్ లోడ్ , ఫిట్ నెస్ లేకుండా, తిరుగుతున్న వాహనాలపై తనిఖీలు చేసి జప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు విడుదల చేశారు. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్లు, సిబ్బంది కొరత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులు , బస్టాండ్లలో పరిశుభ్రతను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించి వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : Rajya Sabha : రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ దనఖడ్ జయ బచ్చన్ మధ్య సభలో ఘర్షణ

Leave A Reply

Your Email Id will not be published!