Minister Satya Kumar : ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యానికి మంత్రి కీలక సూచనలు

ఆదివారం విజయవాడలో మంత్రి సత్యకుమార్ మాట్లడుతూ....

Satya Kumar : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ముందుకు రావాలని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు రూ. 25 లక్షల మేర వైద్య సహాయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. వైద్యానికి 6.5 శాతం బడ్జెట్‌లో నిధుల పెంచి రూ.18,500 కోట్లు కేటాయించారన్నారు.

Minister Satya Kumar Comments

అలాగే వైద్యానికి 12 శాతం నిధులను బడ్జెట్‌లో కేంద్రం పెంచిందని వివరించారు. ఆదివారం విజయవాడలో మంత్రి సత్యకుమార్ మాట్లడుతూ.. క్యాన్సర్ నివారణకు 4 కోట్ల మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు.. ప్రభుత్వాసుపత్రులలో అందుతున్నాయన్నారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించాలన్నారు. క్యాన్సర్ పరీక్షలు.. తొలి దశలోనే చేసుకోవాలని మహిళలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. క్యాన్సర్‌ను 63 శాతం నివారణ చేయవచ్చని చెప్పారు. గుండె జబ్బులకు రూ. 45 వేల విలువైన ఇంజక్షన్‌ను రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రభుత్వం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక కంటి జబ్బులున్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు ప్రభుత్వ వైద్యులు నిర్వహిస్తున్నారన్నారు.

Also Read : Delhi Elections-BJP CM : ఢిల్లీ సీఎం రేసులో బీజేపీ నుంచి ఆ 3 నేతలు

Leave A Reply

Your Email Id will not be published!