Minister Satyakumar : కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అగౌవరపరిచింది
అంబేద్కర్ పోటీ చేసినప్పుడు బీజేపీ అభ్యర్థిని పోటీకి దించకుండా ఆయన్ని బీజేపీ గౌరవించింది...
Satyakumar : ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగ బద్ధంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఉన్నట్టుండి రాజ్యాంగం, అంబేద్కర్ మీద ప్రేమ పుట్టుకువచ్చిందని విమర్శించారు. ఇవాళ విజయవాడలో మంత్రి సత్యకుమార్(Satyakumar) పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో 24వ సవరణ తీసుకువచ్చి ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కులు హరించే విధంగా కాంగ్రెస్ పాలన చేసిందని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రాజ్యాంగం రచించ్చేటప్పుడు అంబేద్కర్ని అవమానపరిచేలా కాంగ్రెస్ పార్టీ కార్టూన్స్ని విడుదల చేశారని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ని నెహ్రు చాలా విధాలుగా అగౌరవపరిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించారని చెప్పారు.
Minister Satyakumar Slams..
‘‘అంబేద్కర్ పోటీ చేసినప్పుడు బీజేపీ అభ్యర్థిని పోటీకి దించకుండా ఆయన్ని బీజేపీ గౌరవించింది. అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించటానికి నెహ్రు అడ్డుపడ్డారు. అంబేద్కర్ సేవలకు భారతరత్న ఇవ్వకుండా నెహ్రుకు మాత్రం ప్రకటించుకున్నారు. అంబేద్కర్ సేవలు గుర్తించి బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించింది. అంబేద్కర్ నడయాడిన ఐదు ప్రదేశాల్లో పంచ తీర్థ్ కార్యక్రమంతో బీజేపీ శ్రీకారం చుట్టింది. ఏపీలో కూడా కొత్త పిచ్చగాళ్ళు తయారయ్యారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యింది. అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ మనుగడ కోల్పోతుంది. కాంగ్రెస్ తప్పు తెలుసుకుని అసత్య ప్రచారాలు చేయటం మానుకుంటే మంచిది. జమిలి ఎన్నికలు ఈ దేశానికి కొత్త కాదు. గతంలో చూసుకుంటే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి’’ అని మంత్రి సత్యకుమార్(Satyakumar) తెలిపారు.
‘‘వైసీపీఅధినేత జగన్ మోహన్ రెడ్డి 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని అని చెప్పి పార్టీ నాయకులని కాపాడుకుంటున్నారు. పార్టీలో నుంచి ముఖ్యమైన నాయకులు బయటకు వెళ్లిపోతున్నారని వారిని కాపాడుకునేందుకు జగన్ 2027లో జమిలి వస్తాయని చెబుతున్నాడు. వైసీపీ పార్టీ ఖాళీ అవ్వకుండా కాపాడుకునేందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. జమిలి ఎన్నికలపై కమిటీ వేశారు. కమిటీ అభిప్రాయాల మేరకు ఎప్పుడు జరుగుతాయో తెలియచేస్తారు. పార్లమెంట్లో బలం ఉంటే బిల్లు పెట్టాలని రూల్ లేదు. జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవ్వడంతో పాటు దేశ అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది. రాష్ట్రాల్లో ఏదొక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాలన పరంగా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది’’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
Also Read : CM Chandrababu : ధాన్యం తేమ శాతంలో తేడా జరిగితే చర్యలు తప్పవంటున్న సీఎం