Minister Savitha : మాజీ సీఎం జగన్ శాంతి భద్రతలను నాశనం చేసారు
వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని....
Minister Savitha: రైతన్నల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి లేదని మంత్రి ఎస్ సవిత విమర్శించారు. రెండు రోజులు ఏపీకి వచ్చి అల్లర్లు సృష్టించి తిరిగి బెంగళూరు వెళ్లి జగన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటారని ఎద్దేవా చేశారు. ఇవాళ(గురువారం) మంత్రి సవిత తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత(Minister Savitha) మాట్లాడుతూ… వైసీపీ ఉనికిని కాపాడేందుకే జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.ఎన్నికల నియమావళి గురించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి తెలియదని చెప్పారు.
Minister Savitha Slams
వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని.. అయినా జగన్ తీరులో మార్పు రావడం లేదని అన్నారు. రైతుల వేషంలో వైసీపీ మూకలు మిర్చి యార్డుకు వచ్చారన్నారు. 2017లో మిర్చి ధర రూ.7 వేలుగా ఉన్నప్పుడు రైతు నష్టపోతాడని రూ.1500 క్వింటాకు బోనస్ ఇచ్చి రైతులను చంద్రబాబు ఆదుకున్నారని గుర్తుచేశారు. జగన్(YS Jagan) రెడ్డి పెట్టిపోయిన రూ.1680 కోట్ల ధాన్యం బకాయిలను తాము విడుదల చేశామని తెలిపారు.పోలీసులపై జగన్ రెడ్డి వాడిన భాష సరైనది కాదని అన్నారు. పిచ్చి ముదిరితే మరోసారి లండన్ వెళ్లి టాబ్లెట్స్ డోస్ పెంచుకోవాలని సలహా ఇచ్చారు.
నారా భువనేశ్వరిని అసభ్యకరంగా మాట్లాడిన అరాచకవాది కోసం మరో అరాచకవాది పరామర్శకు వెళ్లడం విచిత్రంగా ఉందని విమర్శలు చేశారు. అన్ని వ్యవస్థలను, శాంతిభద్రతలను నాశనం చేసిన జగన్ రెడ్డికి ఈ మంచి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం చూసి జీర్ణించుకోలేక జగన్ రెడ్డి తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. నిజంగా జగన్ రెడ్డి ప్రజాపక్షపాతి అయితే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. తప్పకుండా అతనికి మైక్ ఇస్తాం.. ప్రతీ విషయంపై చర్చించిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు.
Also Read : YS Sharmila Slams : మాజీ మంత్రి బొత్సాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఘరం