Minister Seethakka : రైతులను అవమానించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నీతులు చెప్తుంది

గతంలో సాగుచేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు...

Minister Seethakka : రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల రైతు భరోసాపై ఈ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసాపై ప్రభుత్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు రూ.80 వేల కోట్లు ఇచ్చిందని అన్నారు.గతంలో సాగుచేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు.

Minister Seethakka Comments

ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఇవాళ(శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌-2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే సభ ముందుకు తెలంగాణ మున్సిపాలిటీల 2024 బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు 2024ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ భూ భారతి బిల్లును మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రైతు భరోసాపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని మంత్రి సీతక్క(Minister Seethakka) ధ్వజమెత్తారు. సన్న వడ్లు వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రుణమాఫీ ఎందుకు కాలేదని నిలదీశారు. కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయిందన్నారు. మీరు అన్ని చేస్తే, రూ.30 వేల కోట్లు ఇంకా రైతులపై రుణం ఎందుకు ఉందని అడిగారు. ఫామ్ హౌస్‌లు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఇవ్వాలా చెప్పాలని నిలదీశారు. రైతు భరోసాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని మంత్రి సీతక్క అన్నారు.

Also Read : CM Chandrababu : మాజీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!