Minister Seethakka : గిరిజన మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై ఫిర్యాదు
వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు న్యాయవాది వెంకట నాయక్ ఫిర్యాదు చేశారు...
Minister Seethakka : రాను రాను సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. యువతులపై లైంగిక వేధింపులే కాకుండా.. వారి ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ దుర్మార్గానికి పాల్పడుతుంటారు కొందరు వ్యక్తులు. సామాన్య మహిళలే కాదు మంచి హోదా, పరపతి ఉన్న వారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మహిళ మంత్రిని సైతం వదలలేదు ఆగంతకులు. మంత్రి సీతక్కకు సంబంధించిన వీడియోను కొందరు ఆగంతకులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. వీడియోని మార్ఫింగ్ చేసి సౌండ్స్ మార్చి ఎక్స్ ఖాతాలో సదరు ఆగంతకులు సర్క్యులేట్ చేశారు.
Minister Seethakka…
వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు న్యాయవాది వెంకట నాయక్ ఫిర్యాదు చేశారు. అలానే మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కూడా మార్ఫింగ్‌పై కూడా ఫిర్యాదు చేశారు. రెండు వీడియోలను సర్కులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వెంకట్ నాయక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్వకేట్ వెంకట నాయక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐటీఏ -2000-200, 79,33, (4),353(1) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైవు మంత్రి సీతక్క(Minister Seethakka) వీడియో మార్ఫింగ్ అంశం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సభలో ఏదో వీడియో తీసుకుని ఇష్టారాజ్యంగా పోస్టు చేస్తున్నారని, పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన మహిళా మంత్రిపై ఇలాంటి పోస్టులా అంటూ మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… పార్లమెంట్, అసెంబ్లీలో ఫోటోలు తీయడం నేరమని.. దీనిపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. సీతక్క మీద తప్పుడు ట్రోలింగ్ చేస్తే చర్యలు తీసుకోవద్దా… ప్రతిపక్ష సభ్యులు చర్యలు తీసుకోవద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారు. చివరగా దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఫోటో మార్ఫింగ్‌పై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : Deputy CM Pawan : పింగళి వెంకయ్య ను స్మరించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం