Minister Seethakka : మూసి నిర్వాసితులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా చెక్కుల పంపిణీ..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ...
Minister Seethakka : మూసీ నిర్వాసితులను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సహా జీవనోపాధి మెరుగుపరచుకునేందుకు రుణాల రూపంలో నగదు అందజేస్తోంది. ఈ మేరకు మూసీ పునరావాస మహిళా సంఘాలకు కాంగ్రెస్ సర్కార్ రుణాలు మంజూరు చేసింది. వీటిని సంబంధించిన చెక్కులను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అందజేశారు. 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు చెందిన 172మంది మహిళలకు రూ.3.44 కోట్ల విలువైన చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు.
Minister Seethakka Distributes..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ.. ” ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు వెళ్లేటప్పుడు కొంత కష్టంగానే ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూసీ నది వరద ఉద్ధృతి పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రకృతి వైపరిత్యాలు దేశంలో సంభవిస్తున్నాయి. మంచి వాతావరణంలో మనం జీవించాలి. మంచి గాలి, నీళ్లు దొరికే ప్రదేశంలో జీవనం సాగించాలి. ఒక తరం మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇబ్బందుల్లో నివసించారు. రేపటి తరమైన మంచి వాతావరణంలో బతికేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మహిళా గ్రూపులలో ఒక్కో మహిళలకు రూ.2లక్షలు రుణంగా ఇస్తున్నాం.
రూ.2 లక్షల్లో రూ.1.40లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. కేవలం రూ.60వేలు మాత్రమే మహిళా సంఘాలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం సహాయంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలి. కుట్టు మిషన్లను సైతం మూసీ నది మహిళా సంఘాలకు ఇస్తాం. వివిధ రకాల వ్యాపారాలకు మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తాం. పునరావాసం పొందిన వారి పిల్లలకు అన్ని రకాల విద్యా సదుపాయాలను కల్పిస్తున్నాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాలా, కౌసర్ మోయినుద్దీన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read : YS Jagan : దోచుకో, పంచుకో, తినుకో అనేదే సీఎం చంద్రబాబు అజెండా – వైఎస్ జగన్