Minister Uttam Kumar Reddy : బనకచెర్ల ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోము

Uttam Kumar Reddy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ తీవ్ర వ్యతిరేకతను ప్రకటించింది. ఈ ప్రాజెక్టు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలకు పూర్తిగా విరుద్ధమని, ఇది తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయాన్ని కలిగిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Minister Uttam Kumar Reddy Comments

ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లామని, జనవరి 22న ఆయనకు లేఖ రాశామని మంత్రి తెలిపారు. అంతేకాక, తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా లేఖ రాసి, బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలను వివరించినట్లు చెప్పారు.

Also Read : CM Chandrababu : చీనాబ్ రివర్ బ్రిడ్జి పై సీఎం చంద్రబాబు కీలక ట్వీట్

Leave A Reply

Your Email Id will not be published!