Samson vs Faf Du Plessis : మిస్ట‌ర్ కూల్ వ‌ర్సెస్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్

ఆర్సీబీ, ఆర్ఆర్ కెప్టెన్లు ఇద్ద‌రూ ఇద్ద‌రే

Samson vs Faf Du Plessis : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ ఆఖ‌రి అంకానికి చేరింది. క్వాలిఫ‌యిర్ -2 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియం.

అనుకోని రీతిలో ప్లే ఆఫ్స్ కు ఎంట‌రై ఆపై ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు చుక్క‌లు చూపించి అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.

ఇక ఎలాంటి అంచ‌నాలు లేకుండానే బ‌రిలోకి దిగి నిల‌క‌డ‌గా రాణిస్తూ ప్లే ఆఫ్స్ లో 2వ స్థానంలోకి చేరి క్వాలిఫ‌యిర్ -1 గుజ‌రాత్ టైటాన్స్ తో ఓట‌మి పాలైంది రాజ‌స్తాన్ రాయ‌ల్స్.

ఐపీఎల్ రూల్ ప్ర‌కారం 2 స్థానంలో ఉన్న జ‌ట్టు కు ఓడి పోయినా రెండో క్వాలిఫ‌యిర్ ఆడేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో గెలుపొందిన ఆర్సీబీతో రాజ‌స్తాన్ ఇవాళ ఆడ‌నుంది.

ఇక ఇరు జ‌ట్ల‌కు కెప్టెన్లుగా ఉన్నారు సంజూ శాంస‌న్, పాఫ్ డుప్లెసిస్. ఎలాంటి ఒత్తిళ్ల లోనైనా స‌రే తొట్రు పాటు ప‌డ‌కుండా చాలా ప్ర‌శాంతంగా ఉండే మ‌న‌స్త‌త్వం కేర‌ళ స్టార్ శాంస‌న్ ది.

అందుకే జ‌ట్టులో త‌న‌కంటే సీనియ‌ర్లు ఉన్నా జూనియ‌ర్లు ఉన్నా అంద‌రినీ క‌లుపుకుని పోతున్నాడు. ఈసారి కూడా శాంస‌న్ పై న‌మ్మ‌కం ఉంచింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మేనేజ్ మెంట్.

ప్ర‌త్యేకించి హెడ్ కోచ్ , డైరెక్ట‌ర్ గా ఉన్న కుమార సంగ‌క్క‌ర‌కు అత్యంత ఇష్ట‌మైన ప్లేయ‌ర్ శాంస‌న్. ఇక పాఫ్ డుప్లెసిస్(Samson vs Faf Du Plessis) కు అనుకోని చాన్స్ ద‌క్కింది.

కోహ్లీ ఉన్న‌ట్టుండి త‌ప్పు కోవ‌డంతో ఆర్సీబీ యాజ‌మాన్యం మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ గా ఉండే డుప్లెసిస్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది. ఇక సంజూ, పాఫ్ ఇద్ద‌రూ ఆరితేరిన వాళ్లే. మ‌రి ఎవ‌రి ప్లాన్ ఏ ర‌కంగా అమ‌లు అవుతుంద‌నేది తేలుతుంది ఇవాళ‌.

Also Read : సంగ‌క్క‌ర ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా

Leave A Reply

Your Email Id will not be published!