Mitchell Marsh Kohli : కోహ్లీ ఆట తీరుకు మిచెల్ మార్ష్ బౌల్డ్

భార‌త్..పాకిస్తాన్ మ్యాచ్ అద్భుతం

Mitchell Marsh Kohli : దాయాదులైన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డితే యావ‌త్ ప్ర‌పంచం ఊపిరి బిగిప‌ట్టి చూస్తుంది. అందుకే అంత క్రేజ్. ఇక ఆఖ‌రి బంతి దాకా నువ్వా నేనా అని త‌ల‌ప‌డితే ఎలా ఉంటుంది. ఇదే జ‌రిగింది ఆస్ట్రేలియాలోని టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో. సూప‌ర్ 12లో భాగంగా జరిగిన కీల‌క పోరులో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్ పై.

కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఒక ర‌కంగా ఏ ద‌శ‌లోనూ భార‌త్ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కం లేదు. కానీ ఛేజింగ్ ను ఛాలెంజ్ గా తీసుకుని ఆడే ఆట‌గాళ్ల‌లో ఒకే ఒక్క‌డిగా పేరొందాడు ర‌న్ మెషీన్ , భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.

గ‌త కొంత కాలం నుంచీ ఫామ్ లేమితో నానా తంటాలు ప‌డ్డాడు. ఆపై జ‌ట్టులో ఉంటాడో ఉండ‌డోన‌న్న అనుమానం తలెత్తింది. చివ‌ర‌కు యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2022లో రాణించాడు. ఆఫ్గ‌నిస్తాన్ పై చెల‌రేగాడు. అంత‌కు ముందు హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

తాజా వ‌రల్డ్ క‌ప్ లో దుమ్ము రేపాడు. 53 బంతులు ఎదుర్కొని 4 సిక్స‌ర్లు 6 ఫోర్ల‌తో 82 ప‌రుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. పాకిస్తాన్ చేతిలో ఉన్న మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పేశాడు. ఒక ర‌కంగా అద్భుతం చేశాడు విరాట్ కోహ్లీ. దీనిపై ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh Kohli) ఆకాశానికి ఎత్తేశాడు కోహ్లీ ఆట తీరును.

ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు. ల‌క్ష మంది జ‌నం మ‌ధ్య‌న తాను కూడా ఉండి చూసి ఉంటే ఎంత బావుండేద‌న్నాడు మార్ష్.

Also Read : మ‌న పోరాటం అద్భుతం కానీ ఓడి పోయాం

Leave A Reply

Your Email Id will not be published!