Mithali Raj : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మహిళా వన్డే వరల్డ్ కప్ -2022 లో భాగంగా అత్యధిక మ్యాచ్ లకు నాయకత్వం వహించిన నాయకురాలిగా హైదరాబాద్ కు చెందిన స్టార్ ప్లేయర్ టీమిండియా స్కిప్పర్ మిథాలీ రజా్ (Mithali Raj )చరిత్ర సృష్టించారు.
ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా 23 మ్యాచ్ లకు వహించగా ఇవాళ విండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. ఏకంగా 155 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ తో భారత జట్టు తరపున మిథాలీ రాజ్ 24 మ్యాచ్ లకు నాయకత్వం వహించింది. అంతే కాదు వరల్డ్ కప్ పరంగా చూస్తే ఆమెకు ఇది ఆరో వరల్డ్ కప్ కావడం కూడా ఓ చరిత్రే.
2000లో జరిగిన వరల్డ్ కప్ లో పాల్గొన్న మిథాలీ రాజ్ ఇప్పుడు 2022 లో అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రిచ్ లీగ్ లో పాల్గొనడం విశేషం.
ఈ మేరకు ఇవాళ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ లో అత్యధిక మ్యాచ్ లకు నాయకత్వం వహించిన రికార్డును అధిగమించిందని మిథాలీ రాజ్ బద్దలు కొట్టిందని వెల్లడించింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. మిథాలీ పురుషుల క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, జావేద్ మియందాద్ బ్యాటర్ల సరసన చేరింది. వరుసగా ఆరు కప్ ల ఎడిషన్ లలో పాల్గొని హిస్టరీ క్రియేట్ చేసింది.
ఇవాల్టీ మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించింది. ఇందులో మంధాన, కౌర్ సెంచరీలు సాధించి సత్తా చాటారు.
Also Read : మంధాన క్లాసీ ఇన్నింగ్స్ మెస్మరైజ్