Mithali Raj : ప్రపంచ క్రీడా లోకంలో క్రికెట్ ఓ అద్భుతం. ఒకప్పుడు అది జెంటిల్మెన్ గేమ్. కానీ ఇప్పుడు కాసులు కురిపించే అక్షయపాత్ర. ఆ ఆటకు 157 ఏళ్ల చరిత్ర ఉంది. ఆద్యంతమూ ఆటపై కూడా పురుషాధిక్యమే ప్రదర్శిస్తూ వచ్చింది.
ఆ తర్వాత మహిళలు ఆడడం ప్రారంభించారు. మహిళా క్రికెట్ లో భారత దేశం తరపున ఆడిన హైదరాబాదీ మిథాలీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఎందుకంటే ఇండియా అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇక్కడ ఓ మతం. అంతలా ఆక్టోపస్ లా అల్లుకు పోయింది. పాతుకు పోయింది. హైదరాబాద్ నుంచి ఎందరో ప్రాతినిధ్యం వహించారు.
వారిలో ఎక్కువగా వరల్డ్ వైడ్ గా గుర్తుకు తెచ్చేలా చేసింది మాత్రం ఇద్దరే ఇద్దరు ఒకరు భారత క్రికెట్ జట్టుకు విజయాలు అందించిన స్కిప్పర్ గా పేరొందిన మహమ్మద్ అజహరుద్దీన్ అయితే మరొకరు ఇదే మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న మిథాలీ రాజ్(Mithali Raj).
ఎన్నో రికార్డులు ఆమె పేరుతో ఉన్నాయి. కానీ తన అందంతోనే కాదు ఆట తోనూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఒక మహిళగా క్రికెట్ జర్నీలో ఏకంగా 23 ఏళ్ల పాటు ఆడడం అంటే మామూలు మాటలు కాదు.
మిథాలీ రాజ్ ఓ లివింగ్ లెజెండ్ అని చెప్పక తప్పదు. ఎవరూ ఊహించని రీతిలో తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక సమయం ఆసన్నమైందని పేర్కొంది.
మహిళా క్రికెట్ కు మంచి రోజులు వచ్చాయని చెప్పింది. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ప్రతి చోటా ప్రతి నోటా తన పేరు జపించేలా తనను తాను ప్రూవ్ చేసుకుంది. మహిళా క్రికెట్ లోకంలో మిథాలీ రాజ్ ఓ దృవతార అని చెప్పక తప్పదు.
Also Read : క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై