Mithali Raj : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ (World Cup) లో భారత జట్టు సెమీస్ కు చేరకుండానే ఇంటి బాట పట్టింది.
విచిత్రం ఏమిటంటే చివరి వరకు మ్యాచ్ భారత్ వైపు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా అనూహ్యమైన రీతిలో ఆఖరు ఓవర్ లో గెలుపొందింది. చివరి వరకు భారత్ తన పోరాట పటిమను ప్రదర్శించింది.
ఇదిలా ఉండగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా మిథాలీ రాజ్ రికార్డ్ సృష్టించింది. కాగా వరల్డ్ కప్ (World Cup) ప్రారంభం కంటే ముందు కీలక వ్యాఖ్యలు చేసింది.
తన కెరీర్ లో ఎన్నో రికార్డులు ఉన్నప్పటికీ జీవితంలో మరిచి పోలేని ఒకే ఒక్క కోరిక వరల్డ్ కప్ (World Cup) అని చెప్పింది. అంతే కాదు 2022 వరల్డ్ తన కెరీర్ లో ఆఖరుదవుతుందని స్పష్టం చేసింది.
ఇక తాను ఆటను ఆడలేనని, తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో సఫారీ టీంతో మ్యాచ్ ముగిశాక మిథాలీ రాజ్(Mithali Raj )మీడియాతో మాట్లాడింది. కానీ తన రిటర్మైంట్ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
దీనిపై మీడియా ప్రత్యేకంగా ప్రశ్నించడంతో ఆమె మౌనంగా ఉన్నారు. సఫారీతో ఓడి పోవడాన్ని సీరియస్ గా తీసుకున్నామన్నారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం మిథాలీ రాజ్ కు 39 ఏళ్లు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు గురించి పెద్దగా ప్లాన్ చేసుకోలేదన్నారు. దీనికి కొంత సమయం పడుతుందని చెప్పింది మిథాలీ రాజ్.
Also Read : ఆర్సీబీకి బిగ్ షాక్ పంజాబ్ విక్టరీ