Mithali Raj Signature : క్రికెట్ ప్ర‌స్థానం మిథాలీ చెర‌గ‌ని సంత‌కం

ఎన్నో అవ‌మానాలు మ‌రెన్నో ఒడిదుడుకులు

Mithali Raj Signature : క్రికెట్ అంటే భార‌త్ లో మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది పురుషులే. అలాంటి పురుషాధిక్య క్రికెట్ ప్ర‌పంచాన్ని త‌న వైపు తిప్పుకునేలా చేసిన ఏకైక మ‌హిళా క్రికెట‌ర్ మాత్రం హైద‌రాబాదీ మిథాలీ రాజ్.

స్టార్ ప్లేయ‌ర్లు అంటే క‌పిల్ , అజహ‌రుద్దీన్, స‌చిన్, ద్ర‌విడ్, గంగూలీ, ధోనీ, కోహ్లీ ఇలా ఠ‌క్కున చెప్పేస్తారు అభిమానులు. కానీ వీరంద‌రిని త‌ట్టుకుని ఒంట‌రిగా నిల‌బ‌డేలా చేసింది మాత్రం ఎవ‌రు అవునన్నా కాదన్నా మ‌న ముద్దు బిడ్డ మిథాలీ రాజ్(Mithali Raj Signature) .

ఇప్పుడు ఆమెకు 39 ఏళ్లు. ఇక సుదీర్ఘ కాలం పాటు ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొంది. మ‌రెన్నో క‌ష్టాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డింది. మూడు ఫార్మాట్ లు ( టెస్టు, వ‌న్డే, టీ20 ) క‌లిపి 10 వేలకు పైగా ప‌రుగులు సాధించి చ‌రిత్ర నెల‌కొల్పింది.

ఈ జ‌ర్నీ మామూలు విష‌యం కాదు. ఎంతో సాధ‌న ఉండాలి. అంత‌కంటే ఎక్కువ ద‌మ్ముండాలి. క్రికెట్ లో తెలియ‌ని రాజ‌కీయాలు ఎన్నో. ఎంద‌రో ఒత్తిళ్లు, ప్ర‌లోభాలు ఉండ‌నే ఉంటాయి.

క‌నిపించే ఆట వేరు క‌నిపించ‌ని ఆట వేరు. కానీ త‌న‌కంటూ స‌పోర్ట్ లేక పోయినా ఒంట‌రిగా ప్ర‌యాణం చేసింది. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది.

అద్భుత‌మైన క్రికెట‌ర్ గ భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ పేజీని ఉండేలా చేసుకున్న ఘ‌న‌త మాత్రం ముమ్మాటికీ మిథాలీ రాజ్ దే. మ‌హిళ‌ల గురించి మాట్లాడుకునేలా చేసింది.

క్రికెట్ ప్ర‌స్తానంలో ఆమె చెర‌గ‌ని సంత‌కం చేసింది. దీనిని ఇంకొక‌రు భ‌ర్తీ చేయాలంటే కొన్నేళ్లు ప‌డుతుంది. రికార్డులు ఉంటాయి. కానీ ఆట మాత్రం అలాగే ఉంటుంది.

కొన‌సాగుతూనే ఉంటుంది. 23 ఏళ్ల కెరీర్ లో కొత్త పుంత‌లు తొక్కించింది క్రికెట్ ను. ఎలాంటి ఆద‌ర‌ణ లేని స‌మ‌యంలో ఆట‌కు గుర్తింపు తెచ్చేలా చేసింది మిథాలీ రాజ్.

మ‌హిళా క్రికెట్ లో ఎన్నో మార్పులు వ‌చ్చాయంటే కార‌ణం ఆమె ఆడ‌డం వ‌ల్లే అని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌రాలు మారాయి. ఫార్మాట్ లు మారాయి. కానీ మిథాలీ రాజ్ ఆట తీరు మార‌లేదు.

రోజు రోజుకు త‌న‌దైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. మ‌హిళా క్రికెట్ లో ఆల్ టైట్ గ్రేట్ బ్యాట‌ర్ గా చ‌రిత్ర సృష్టించింది. భ‌ర‌త నాట్యం కాద‌నుకుని క్రికెట్ లో రారాణిగా వెలుగొందింది మిథాలీ రాజ్(Mithali Raj Signature).

Also Read : జ‌ర్నీ అద్భుతం ఆట చిర‌స్మ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!