Mithali Raj Powar : అవ‌మానాల్ని భ‌రించి విజేత‌గా నిలిచి

మిథాలీ రాజ్ క్రికెట్ జ‌ర్నీలో మ‌లుపులు

Mithali Raj Powar : భార‌త మ‌హిళా క్రికెట్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయ‌ర్ గా మిథాలీ రాజ్ నిలిచింది. ఆమెను లేడీ స‌చిన్ టెండూల్క‌ర్ తో పోల్చ‌డం స‌బ‌బే. మూడు ఫార్మాట్ ( టెస్టు, వ‌న్డే, టి20) ల‌లో ఏకంగా 10, 000 ర‌న్స్ సాధించిన క్రికెట‌ర్ గా వ‌ర‌ల్డ్ క్రికెట్ లో రికార్డు క్రియేట్ చేసింది.

త‌క్కువ వ‌యస్సులోనే క్రికెట్ జ‌ర్నీ చేసింది. 1999లో ఐర్లాండ్ తో ప్రారంభ‌మైన మిథాలీ రాజ్(Mithali Raj Powar) 2022 దాకా సాగింది. అజేయ సెంచ‌రీతో ప్రారంభ‌మై 68 ప‌రుగుల‌తో ద‌క్షిణాఫ్రికాతో ముగిసింది.

ప్ర‌తి క్రికెట‌ర్ జ‌ర్నీలో ఆటుపోట్లు ఉంటాయి. అవ‌మానాలు కూడా ఉంటాయి. అలాగే ఎలాంటి ఆద‌ర‌ణ లేని మ‌హిళా క్రికెట్ లో ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు

ఆట‌కు ఆద‌ర‌ణ తీసుకు వ‌చ్చేలా చేసింది. జ్యోతి ప్ర‌సాద్ ఆమెలోని టాలెంట్ గుర్తించాడు. సంప‌త్ ఆమెను క్రికెట‌ర్ గా అద్భుతంగా తీర్చిదిద్దాడు.

ఇదిలా ఉండ‌గా త‌న కెరీర్ లో అవ‌మానాన్ని ఎదుర్కొంది. వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన 2018 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ టైటిల్ ఫేవ‌రేట్ గా బ‌రిలోకి దిగింది.

అయితే ఇంగ్లండ్ తో జ‌రిగిన సెమీస్ లో మిథాలీ రాజ్(Mithali Raj Powar)  ను తుది జ‌ట్టులో నుంచి త‌ప్పించ‌డం వావాద‌స్ప‌దంగా మారింది.

చీప్ కోచ్ ర‌మేశ్ పొవార్ తో పాటు జ‌ట్టులోని సీనియ‌ర్లు త‌న ప‌ట్ల అమర్యాద‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆరోపించింది మిథాలీ రాజ్.

ఈ సంద‌ర్భంగా ఆనాటి బీసీసీఐ సిఇఓ రాహుల్ జోహ్రీ, జీఎం సాబా క‌రీమ్ ల‌కు ఆమె లేఖ రాయ‌డం తీవ్ర దుమారం రేపింది. క్రీడా లోకం విస్తు పోయింది. 2019 లో టీ20కి గుడ్ బై చెప్పింది .

ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రు అవుతుంద‌ని ప్ర‌క‌టించింది. శ్రీ‌లంక టూర్ కు జ‌ట్టును ప్ర‌క‌టించే ముందే మిథాలీ రాజ్(Mithali Raj Powar) త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.

Also Read : అంద‌ని ద్రాక్ష ‘మిథాలీ’ తీర‌ని క‌ల

Leave A Reply

Your Email Id will not be published!