Mithali Raj : అందని ద్రాక్ష ‘మిథాలీ’ తీరని కల
వరల్డ్ కప్ సాధించాలన్న కసి
Mithali Raj : ప్రపంచ మహిళా క్రికెట్ లో ఆల్ టైట్ గ్రేట్ ప్లేయర్ ( బ్యాటర్ ) గా పేరున్న మిథాలీ రాజ్(Mithali Raj) గురించి ఎంత చెప్పినా తక్కువే.
అన్ని ఫార్మాట్ లు ( టెస్టు, వన్డే, టీ20) కలిపి 10, 000 వేలకు పైగా పరుగులు సాధించి చరిత్ర సృష్టంచిన ఈ క్రికెటర్ తన కెరీర్ లో తీరని కల ఒక్కటే ఉంది.
అదేమిటంటే తన సారథ్యంలో వరల్డ్ కప్ తీసుకు రావాలని. రెండు సార్లు భారత క్రికెట్ జట్టును ఫైనల్స్ చేర్చినా కప్ ను కొట్టలేక పోయింది. అదే ఆమెను తీవ్రంగా నిరాశ పర్చింది.
1999లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం 2022 దాకా అంటే దాదాపు 23 ఏళ్లకు పైగా సాగింది. ఈ విస్తృత క్రికెట్ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరెన్నో అవమానాలు ఉన్నాయి.
కానీ తనదైన ఆటతో క్రికెట్ కు వన్నె తెచ్చింది. 2005లో తొలిసారిగా భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. ఆమె సారథ్యంలో 2005లో వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరింది. కానీ కప్పు గెలవలేక పోయింది.
ఇదిలా ఉండగా వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టును రెండు సార్లు ఫైనల్ కు చేర్చిన ఏకైక కెప్టెన్ గా మిథాలీ రాజ్(Mithali Raj) చరిత్ర నెలకొల్పింది. ఈ ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని దక్కించు కోలేక పోయింది.
ఇదే తనను ఎక్కువగా బాధించిందని ఒకానొక సందర్భంలో తెలిపింది. 2005లో వరల్డ్ కప్ ఫైనల్ లో ఆసిస్ చేతిలో ఓడి పోగా 2017లో జరిగిన ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ మహిళల చేతిలో పరాజయం చవి చూసింది.
ఈ అలుపెరుగని ప్రస్థానంలో ఎన్నో మరుపురాని విజయాలు ఉన్నాయి ఆమె కెరీర్ లో. కానీ ఈ ఒక్కటి మాత్రం తీరని కలగా మిగిలి పోయింది.
Also Read : క్రికెట్ ప్రస్థానం మిథాలీ చెరగని సంతకం