Mithali Raj : పురుషాధిక్య సమాజంలో క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ గా మారిన తరుణంలో ఒక్కసారిగా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చింది హైదరాబాద్ కు చెందిన మిథాలీ రాజ్.
ఒక రకంగా అజహరుద్దీన్ తర్వాత అంతటి స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా మహిళా క్రికెట్ రంగంలో పేరు తెచ్చేలా
తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఏ క్రీడాకారిణి సాధించిన రికార్డులను నమోదు చేసింది.
అటు వన్డేల్లో ఇటు టెస్టుల్లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం వరల్డ్ కప్ లో భారత మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఈ టోర్నీ ముగిశాక తాను ఆట నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ విస్తు పోయేలా చేసింది మిథాలీ రాజ్(Mithali Raj). బ్యాటర్ గా ఎన్నో పరుగులు సాధించింది.
భారత క్రికెట్ జట్టుకు ఎనలేని విజయాలు సాధించేలా కీలక పాత్ర పోషించింది.
అన్ని ఫార్మాట్ లు కలిపి అత్యధిక రన్స్ చేసిన విమెన్ క్రికెటర్ గా చరిత్ర నమోదు చేసింది. 1982 డిసెంబర్ 3న పుట్టారు మిథాలీ రాజ్.
1999లో తొలిసారిగా ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ప్రవేశించింది. ఐర్లాండ్ పై 114 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
2001-2 లో మొదటి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ పై లక్నోలో ఆడింది.
ఇదే జట్టుపై టాంటన్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఏకంగా 264 పరుగులు చేసి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
2005లో ఆమె ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకునేలా జట్టును ముందుండి నడిపించింది.
ఆనాటి నుంచి నేటి వరకు ఆరు సార్లు వరల్డ్ కప్ లో పాల్గొన్న క్రికెటర్ గా రికార్డు బ్రేక్ చేసింది.
సచిన్ తర్వాత మిథాలీరాజ్ ఉండడం విశేషం. ఆమెకు ఎన్నో అవార్డులు దక్కాయి. భరత నాట్యంలో కూడా శిక్షణ పొందింది.
ఆమె జీవిత చరిత్రపై ఓ మూవీ కూడా వచ్చింది. ప్రస్తుతం మిథాలీ రాజ్ రైల్వేలో జాబ్ చేస్తోంది. క్రికెట్ పరంగా చూస్తే ఇప్పటి దాకా ఆమె 93 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
45.50 సగటుతో 2, 776 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేలో అత్యధిక స్కోర్ 114 రన్స్. ఇక టెస్టులలో 8 మ్యాచ్ లు ఆడింది .
52 సగటుతో 522 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అర్జున అవార్డుతో మేజర్ ధ్యాన్ చంద్ కేంద్ర ప్రభుత్వం అందించింది.
Also Read : సోనియమ్మ చల్లంగ బతుకమ్మ