MK Stalin Collegium : కొలీజియంపై కేంద్రం జోక్యం తగదు
నరేంద్ర మోడీ సర్కార్ పై స్టాలిన్ ఫైర్
MK Stalin Collegium : కొలీజియం వ్యవస్థపై కేంద్ర సర్కార్ పెత్తనం చెలాయించలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin Collegium). అత్యున్నత న్యాయ వ్యవస్థ నియామకాలపై ప్రభుత్వ నామినీలను కొలీజియం వ్యవస్థలో చేర్చాలని కోరడం న్యాయ వ్యవస్థ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడంతో సమానమని ఇది మంచి పద్దతి కాదన్నారు సీఎం.
కేంద్ర న్యాయ వ్యవస్థపై పెత్తనం చెలాయించాలని అనుకోవడం తగదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేకంగా కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ నామినీలను చేర్చాలని కోరడం పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ,
దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ గత కొంత కాలంగా కొలీజియం వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు కిరెన్ రిజిజు లేఖ రాశారు. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతినిధిగా ఒకరు విధిగా ఉండాలని కోరారు.
ఈ మేరకు ఇదే విషయాన్ని లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి. ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు సీఎం ఎంకే స్టాలిన్. ప్రజాస్వామ్యంలో కీలకమైన స్తంభంగా న్యాయ వ్యవస్థ ఉంటుందని , సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు సీఎం. దీనినే డీఎంకే ప్రధానంగా కోరుకుంటుందన్నారు ఎంకే స్టాలిన్(MK Stalin Collegium).
Also Read : భారతీయులపై ఖలిస్తానీ గ్రూప్ దాడి