MLA Arikepudi Gandhi : బీఆర్ఎస్ నేతలు నా ఇంటికి ఎప్పుడు వచ్చినా సాదర స్వాగతం పలుకుతాను

కౌశిక్ రెడ్డి ఆంధ్ర కామెంట్స్‌పై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు...

MLA Arikepudi : చలో గాంధీ నివాసానికి బీఆర్‌ఎస్ నేతలు ఈరోజు (శుక్రవారం) పిలుపునిచ్చి సంగతి తెలిసిందే. దీనిపై అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ నేతలు నా ఇంటికొస్తే సాదర స్వాగతం పలుకుతాను. కూర్చుని బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు మాట్లాడుకుంటాం. నన్ను ఆంధ్రోడన్న కౌశిక్ రెడ్డి కామెంట్స్‌కు కేసీఆర్ సమాధానం చెప్పాలి. కౌశిక్ రెడ్డి బతకటానికి వచ్చినట్లే.. నేను కూడా హైదరాబాద్ వచ్చాను. నాకు‌.. కౌశిక్ రెడ్డితో పోలికనా? నా క్రమశిక్షణ హరీష్ రావుకు తెలుసు. నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చించిందే హరీష్ రావు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను’’ అని గాంధీ స్పష్టం చేశారు. గతంలో పీఏసీ పదవి కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుకు కాకుండా.. అక్బరుద్దీన్‌కు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.

బీఆర్ఎస్(BRS) పార్టీ సూచించిన వారికే పీఏసీ పదవి ఇవ్వాలని ఏమీ లేదన్నారు. కౌశిక్ రెడ్డి పదే పదే తనను రెచ్చగొట్టటం వల‌నే స్పందించాల్సి వచ్చిందన్నారు. పిల్లిని గదిలో బందించి కొడితే.. పిల్లి కూడా తిరగబడుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి నాశనం పట్టించాడని మండిపడ్డారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు స్వయంగా సభాపతి ప్రకటించారని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలవటానికి తనకు ఇబ్బేందేమీ లేదన్నారు. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు.

MLA Arikepudi Gandhi Comment

కౌశిక్ రెడ్డి ఆంధ్ర కామెంట్స్‌పై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి(Koushik Reddy) చీటర్ .. బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన మనోభావాలు దెబ్బదతినటం వలనే ప్రతిగా స్పందిచాల్సి వచ్చిందన్నారు. పదే పదే రెచ్చగొడ్తుంటే ఎంత కాలం పడాలి అడిగారు. పదేళ్ళు శాసనసభ్యుడిగా క్రమశిక్షణపార్టీ వాళ్ళకు తెలుసని.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi) స్పష్టం చేశారు. మరోవైపు చలో గాంధీ నివాసానికి బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ నివాసంలోకి ఇతరులను అనుమతించేదుకు ఖాకీలు నిరాకరిస్తున్నారు. ఎమ్మెల్యే గాంధీ ప్రస్తుతం నివాసంలోనే ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు వస్తే సాదర స్వాగతం పలుకుతానని గాంధీ చెబుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

కాగా… ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ , కౌశిక్‌ రెడ్డిల మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ(MLA Arikepudi) ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తానన్న కౌశిక్‌.. ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు.. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. చలో గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పిలుపునిచ్చారు.

ఈరోజు ఉదయం 11గంటలకు మల్లంపేటలోని శంభిపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. పీఏసీ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ఆయన నివాసంలో మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు శంబిపూర్రా జు ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరుకావాలని మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పాడి కౌశిక్ రెడ్డి హాజరుకానున్నారు. గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నందున తాను కూడా వెళ్లి కండువా కప్పి శుభాకాంక్షలు చెబుతానని కౌశిక్ రెడ్డి అన్నారు.

Also Read : AP Rains : ఏపీని వదలని వర్షాలు…మరో 3 రోజులు మోస్తరు వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!